Begin typing your search above and press return to search.
'కేజీఎఫ్-2' చూడలేదన్న 'కాంతార' నటుడు!
By: Tupaki Desk | 5 Jan 2023 1:11 PM GMT`కేజీఎఫ్` ప్రాంచైజీ పాన్ ఇండియా వైడ్ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. రెండు భాగాలు బాక్సాఫీస్ ని వసూళ్లతో షేక్ చేసాయి. రెండవ భాగమైతే ఏకంగా `ఆర్ ఆర్ ఆర్` వసూళ్లనే బ్రేక్ చేసింది. కన్నడ ఇండస్ర్టీలోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆరకంగా `కేజీఎఫ్` కన్నడ ఇండస్ర్టీని ఎక్కడికో తీసుకెళ్లింది.
ఇక `కేజీఎఫ్` సక్సెస్ గురించి అన్ని ఇండస్ర్టీలు ..నటులు..నిర్మాతలు..హీరోలు అంతా ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. కానీ సొంత పరిశ్రమకు చెందిన కన్నడ నటుడు కిషోర్ మాత్రం ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. `కేజీఎఫ్ చూసాను. కానీ కేజీఎఫ్-2 చూడలేదు. ఇది నా తరహా సినిమా కాదు.. అందుకే ఇంత వరకూ ఆ సినిమా చూడలేదు`న్నారు. ఇది కేవలం వ్యక్తగతంగా తన అభిప్రాయం మాత్రమే నని...దీన్ని విమర్శగా భావించాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చేసారు.
సినిమాల విషయంలో తనకంటూ కొన్ని వ్యక్తగత అభిప్రాయాలు..నిర్ణయాలు ఉన్నాయని వాటిని మాత్రమే అనుసరిస్తాను అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. `కేజీఎఫ్` చిత్రాన్ని హొంబలే ఫిల్మ్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే బ్యానర్లో కిషోర్ ఇటీవల రిలీజ్ అయి సంచలనం సృష్టించిన `కాంతార` లో నటించారు.
ఇందులో ఆయన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. కీలకమైన పాత్రే. స్వయంగా ఇప్పుడదే బ్యానర్లో నటించిన నటుడు..సొంత పరిశ్రమ నటుడే కేజీఎఫ్ చూడలేదని చెప్పడం కొంతమందిలో చర్చనీయాంశంగా మారింది. సినిమాల విషయంలో ఎవరి అభిరుచులు వారికుంటాయి. హిట్ అయిన అన్ని చిత్రాల్ని అందరూ చూడాలని లేదు.
నచ్చిన వాటిని ఆస్వాదిస్తారు. నచ్చని వాటిని లైట్ తీసుకుంటారు. వాటిపై అంతే ఓపెన్ గా తమ అభిప్రాయాలు పంచుకుంటారు. సినిమా హిట్ అయిన కొన్ని జానర్ చిత్రాల్ని అందరూ ఇష్టపడరు. ఇటీవలే వరల్డ్ ని షేక్ చేసిన `అవతార్-2` గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన అభిప్రాయాన్ని ట్విటర్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ మెచ్చిన సినిమా గురించి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఏంటని కొందరు నెటి జనులు ప్రశ్నించినా సదరు నిర్మాత తన పంథా మాత్రం మార్చుకోలేదు. వాటికి ధీటైన బధులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక కిషోర్ కి నటుడిగా మంచి పేరుంది. తమిళ..కన్నడ. ..మలయాళ..తెలుగు సినిమాల్లో నటించారు. నటుడిగా అతనికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విలనీగా కిషోర్ నటనకు ప్రత్యేకమైన అభిమానులున్నారు. ముఖ్యంగా టాలీవుడ్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.