Begin typing your search above and press return to search.
'కాంతార' కథను రాసుకున్నది ఎవరి కోసమో తెలుసా?
By: Tupaki Desk | 31 Oct 2022 4:30 AM GMTకన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అలియాస్ 'అప్పు' గతేడాది అక్టోబర్ 29న హఠాన్మరణం చెందారు. ఆయన మరణవార్తను కుటుంబ సభ్యులు.. అభిమానులు నేటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ వర్ధంతిని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే(అక్టోబర్ 28న) ఆయన నటించిన చివరి చిత్రం 'గంధన గుడి' ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
సుమారు వంద కోట్ల భారీ బడ్జెట్లో 'గంధన గుడి' చిత్రాన్ని పునీత్ రాజ్ కుమార్ ప్రొడక్షన్ బ్యానర్లో అశ్వినీ పునీత్ రాజ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి అమోఘ వర్ష దర్శకత్వం వహించగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే 'గంధన గుడి' ట్రైలర్ ను విడుదల చేసి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో మంచి టాక్ తో దూసుకెళుతోంది.
గత కొన్నిరోజులుగా ఎక్కడ చూసినా 'కాంతార' మూవీ పైనే దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కన్నడలో తెరకెక్కిన 'కాంతార' మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్లు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 'కాంతార' సినిమా ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కేజీఎఫ్ తర్వాత కన్నడలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం 'కాంతార' నిలుస్తోంది.
దర్శకుడు రిషబ్ శెట్టి తన సొంత ఊరి కథనే 'కాంతార' స్క్రిప్ట్ గా రాసుకున్నాడు. ఈ సినిమాను భారీగా తెరకెక్కించాలని భావించి హెంబాలే ఫీలింస్ నిర్మాతలను సంప్రదించాడు. వారి నుంచి గ్రీన్ రావడంతో హీరోగా పునీత్ రాజ్ కుమార్ అయితేనే బాగుంటుందని దర్శకుడు రిషబ్ శెట్టి భావించాడు. దీంతో అతడి వద్దకు వెళ్లి 'కాంతార' స్టోరీ విన్పించాడు.
దేవుడి బ్యాక్ డ్రాప్ లో ఉన్న 'కాంతార' స్టోరీ పునీత్ రాజ్ కుమార్ ఎంతగానో నచ్చింది. ఇందులో హీరోను దేవుడి ఆవహించినట్లు దర్శకుడు కథను రూపొందించాడు. దీంతో పునీత్ రాజ్ కుమార్ తన కంటే కూడా ఈ కథను నువ్వు చేస్తేనే బాగుంటుందని రిషబ్ శెట్టికి సలహా ఇచ్చాడు. దీంతో రిషబ్ శెట్టినే 'కాంతార'లో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
ఈ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ నటించి ఉంటే 'కాంతార'నే అతడి చివరి నిలిచి ఉండేది. ఆయన ఖాతాలో మరో సూపర్ హిట్ చేరి ఉండేది. కానీ రిషబ్ శెట్టిలో అద్భుతమైన నటుడి గురించి ఎవరికీ తెలిసి ఉండకపోయేది. 'అప్పు' సలహాతో రిషబ్ శెట్టి దర్మకుడు కమ్ హీరోగా 'కాంతార'లో నటించి ప్రస్తుతం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
మరోవైపు 'రిషబ్ శెట్టి' గత చిత్రాలను తెలుగులో డబ్బింగ్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ అవార్డు దక్కించుకున్న 'సాహిప్రషాల కాసారగోడు'.. 'గరుడగమన వృషభ వాహన' సినిమాలు త్వరలోనే టాలీవుడ్లో సందడి చేయబోతున్నాయి. తాజాగా 'కాంతార' మూవీపై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి ఇంటికి పిలిపించుకొని శాలువాతో సత్కరించి అభినందించారు.