Begin typing your search above and press return to search.
'కాంతార' ఓటీటీలోకి వచ్చేసింది కానీ..!
By: Tupaki Desk | 24 Nov 2022 6:40 AM GMTఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా విడుదలై ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న మూవీ 'కాంతార'. స్టార్ కాస్టింగ్ తో సంబందం లేకుండా కేవలం మౌత్ టాక్ తో కంటెంట్ కు ప్రేక్షకులు పట్టకట్టిన సినిమా ఇది. ఇందులో నటించి, డైరెక్ట్ చేసిన రిషబ్‌శెట్టి కన్నడ ప్రేక్షకులకు తప్ప తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకులకు తెలియదు. అసలు పరిచయం లేని నటుడు. కానీ ఈ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాకుండా పాన్ ఇండియా డైరెక్టర్ గానూ ప్రశంసల్ని సొంతం చేసుకున్నాడు.
ఓ ఊరి ప్రజల్ని, వారి నమ్మకాల్ని కాపాడటం కోసం స్వయంగా వారు కొలిచే దేవుడే వారిలో ఒకడిగా వస్తే..మన చుట్టూ పెరిగిపోతున్న చెడుని అంతం చేస్తే ఏంటనే కథతో ఈ మూవీని తెరకెక్కించిన తీరు, మనిషి మరిచిపోతున్న మానవ సంబంధాలని, దైవత్వాన్ని మళ్లీ గుర్తు చేసి ఈ మూవీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమా చివర్లో వచ్చే 15 నిమిషాల సన్నివేశాలు గూస్ బంప్స్ ని తెప్పించి స్పెల్ బౌండ్ అయ్యేలా చేశాయి.
దీంతో ఈ సినిమబాకు ప్రేక్షకులు దేశ వ్యాప్తంగా బ్రహ్మరథం పట్టారు... ఇప్పటికీ పడుతున్నారు. కేవలం 15 కోట్లతో రూపొందిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో ఇప్పటి వరకు రూ. 400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టిందంటే ఈ మూవీ ప్రేక్షకులని ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో రూ. 500 కోట్ల మార్కుని కూడా చేరుకునే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీని థియేటర్లలో చూడని వారు ఓటీటీలో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
సినిమాకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పట్లో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడం కష్టమనే వార్తలు వినించడం మొదలైంది. అయితే సడన్ గా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నామని, ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోందంటూ ప్రకటించి షాకిచ్చారు. ప్రకటనతో షాకిచ్చిన చిత్ర బృందం ఓటీటీలో వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా షాకిచ్చారు. సినిమాలో కీలక హైలైట్ గా నిలిచిన ఘట్టం.. రిషబ్ శెట్టి భూతకోల ఆడే సీన్..
ఈ సీన్ లో 'వరాహ రూపం దైవ వరీష్టం..' అంటూ ఓ పాటు బ్యాగ్రౌండ్ లో వినిపిస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తూ వుంటుంది. రీసెంట్ గా ఈ పాటపై వివాదం చెలరేగడంతో మేకర్స్ ఆ పాటని కట్ చేసి అమెజాన్ ప్రైమ్ వారికి ఇచ్చేశారు. ఇది ఇప్పడు ఓటీటీ వెర్షన్ లో లేకపోవడంతో 'కాంతార' అభిమానులు షాక్ కు గురవుతున్నారట. సినిమాకు ఆయువు పట్టులాంటి సీన్ నే లేపేశారని ప్రస్తుతం నెట్టింట దీనిపై పెద్ద చర్చే మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.