Begin typing your search above and press return to search.

KGF చాప్టర్ 1 ని బీట్ చేసిన కాంతార..!

By:  Tupaki Desk   |   24 Oct 2022 11:19 AM GMT
KGF చాప్టర్ 1 ని బీట్ చేసిన కాంతార..!
X
ఇప్పుడు ఏ సినీ పరిశ్రమ చూసినా సరే కన్నడ సెన్సేషనల్ మూవీ కాంతార గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. రిషబ్ శెట్టి హీరోగా తనే కథ, డైరక్షన్ చేసిన ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా నాల్గవ వారం పూర్తి చేసుకుని ఐదవర వారం లోకి అడుగుపెట్టింది. సినిమా డబ్బింగ్ వర్షన్ కూడా అన్ని చోట్ల అంచనాలకు మించి వసూళ్లను రాబడుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో కాంతార అదరగొట్టేస్తుంది. పెద్దగా ప్రమోట్ చేయకపోయినా సరే కాంతార కాసుల వర్షం కురిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులు తమకు సినిమా నచ్చితే దాన్ని ఎంత పెద్ద హిట్ చేస్తారో కాంతారతో ప్రూవ్ చేస్తున్నారు.

కాంతార ఫోర్త్ వీకెండ్ కూడా మంచి వసూళ్లను రాబట్టింది. నాల్గవ వారం ముగిసే సరికి కాంతార మూవీ ఇండియన్ బాక్సాఫీస్ పై చెలరేగిపోయింది. ఇండియన్ వైడ్ గా 179 కోట్లు వసూళు చేసిన కాంతార ఓవర్సీస్ లో 2.20 మిలియన్ (18 కోట్లు) వసూళు చేసింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు 188 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది కాంతార మూవీ.

మొదటి వారం 26.75 కోట్లు, రెండవ వారం 37.25 కోట్లు, మూడవ వారం 75 కోట్లు వసూళ్లను రాబట్టగా ఏరియా వైడ్ చూస్తే కర్ణాటకలో ఇప్పటివరకు 111.25 కోట్లు, తెలుగు రెండు రాష్ట్రాలు ఏపీ తెలంగాణా మొత్తం 27.25 కోట్లు, తమిళనాడు 3 కోట్లు, కేరళ 2 కోట్లు, నార్త్ ఇండియా 27 కోట్లు కలెక్ట్ చేసింది.

నాల్గవ వారం వీకెండ్ వసూళ్లతో యశ్ KGF చాప్టర్ 1 రికార్డ్ లను కొల్లగొట్టింది కాంతార. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ సృష్టిస్తున్న సంచలనాలు అని ఇన్ని కావు. తెలుగు రాష్ట్రాల్లో అయితే కాంతార ప్రభంజనం సృష్టిస్తుంది. తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు.

పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా కాంతార చేస్తున్న ఈ అద్భుతాలు ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. కాంతార చూశాక రిషబ్ శెట్టికి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. దీపావళి పండుగ కూడా కాంతారకి కలిసి వచ్చింది. సినిమా దూకుడు చూస్తుంటే పండుగ సందర్భంగా 200 కోట్లు దాటేలా ఉంది. ఈ సినిమా ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించేలా ఉందని చెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.