Begin typing your search above and press return to search.
కాంతర ఫుల్ రన్ కలెక్షన్స్.. టార్గెట్ అదే!
By: Tupaki Desk | 2 Nov 2022 2:30 AM GMTకన్నడ చిత్ర పరిశ్రమలో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఏ భాషలో విడుదలైనా కూడా ఈ సినిమాకు ఊహించని రేంజ్ లోనే కలెక్షన్స్ వస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా తెలుగు హిందీలో కూడా పెట్టిన పెట్టుబడి కి రెండు మూడు రోజుల్లోనే లాభాలను అందించింది. ఇక ఇప్పుడు అంతకుమించి అనేలా ప్రాఫిట్స్ కూడా అందిస్తోంది.
చూస్తూ ఉంటే ఈ సినిమా రాబోయే రోజుల్లో మరో పెద్ద రికార్డును అందుకోబోతున్నట్లు బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఈ సినిమా కేవలం కన్నడ చిత్ర పరిశ్రమంలోనే దాదాపు 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక మంది జనాలు వీక్షించిన సినిమాగా కూడా ఇది రికార్డును క్రియేట్ చేసింది.
ఇక తెలుగులో అయితే ఇప్పటికే నిర్మాత అల్లు అరవింద్ కు 20 కోట్ల వరకు లాభలను అందించిన ఈ సినిమా మొత్తంగా 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక హిందీలో కూడా ఆప్ సెంచరీ కొట్టేందుకు రెడీ అవుతోంది.
ఈ తరుణంలో సినిమాకు మిగతా భాషల్లో కూడా మంచి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. వీకెండ్స్ వస్తే చాలు కాంతారకు పోటీగా ఎంత పెద్ద సినిమాలు ఉన్నా కూడా కలెక్షన్స్ తగ్గడం లేదు.
ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా దాదాపు 250 కోట్ల మార్క్ ని టచ్ చేయగా ఇక ఈ సినిమా ఫుల్ రన్ లో త్వరలోనే 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం పక్కా అని తెలుస్తోంది. సాధారణంగా యాక్షన్ సినిమాలు ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకుంటుంది అంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
కానీ కేవలం మౌత్ టాక్ ద్వారా కాంతార లాంటి సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం సెన్సేషన్ అని చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో నార్త్ లో ఈ సినిమాకు కూడా పెద్దగా ప్రమోషన్ చేసింది లేదు. సక్సెస్ అయిన తర్వాతనే చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అది కూడా ఒక కృతజ్ఞతతోనే ఆడియన్స్ కు ధన్యవాదాలు తెలిపినట్లు క్లిక్ అయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.