Begin typing your search above and press return to search.

ఆస్కార్ బరిలో కాంతార..!

By:  Tupaki Desk   |   10 Jan 2023 5:33 AM GMT
ఆస్కార్ బరిలో కాంతార..!
X
రిషబ్ శెట్టి నటించి డైరెక్ట్ చేసిన కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతార ఆసార్క్ బరిలో నిలిచింది. ఈ సినిమా నిర్మించిన హోంబలే ప్రొడక్షన్స్ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది. కాంతార సినిమాను రెండు విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ అయినట్టు చెప్పారు.

రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ కాంతార వసూళ్లలో కూడా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ బరిలో కూడా తలబడుతుంది. 95వ ఆస్కార్ అవార్డుల్లో తమ సినిమా కాంతార ని చేర్చాలని అప్లై చేయగా వారి నుంచి సానుకూల స్పందన వచ్చిందట.

రెండు విభాగాల్లో కాంతార ఆస్కార్ బరిలో నిలుస్తుంది. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా ఆస్కార్ బరిలో ఉంటుందని చెబుతుండగా మరో సౌత్ ఇండియన్ సినిమా ఆస్కార్ పోటీలో నిలిచింది. చిన్న సినిమాగా రిలీజై ఘన విజయాన్ని అందుకున్న కాంతార నేషనల్ వైడ్ గా ఆడియన్స్ ను సూపర్ గా ఎంటర్టైన్ చేసింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన కాంతార సినిమా ఫుల్ రన్ లో 400 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డులకు కూడా నామినేట్ అయ్యింది. ఆస్కార్ బరిలో కాంతార నిలుస్తుందని సినిమా చూసినప్పుడే కొందరు సినీ విశ్లేషకులు చెప్పారు. కాంతార సినిమా భారతీయ సంప్రదాయ ఆధ్యాత్మిక భావాలతో వచ్చిన సినిమా.

భూతకోల వారి నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా అంతా చాలా ఎంగేజింగ్ గా ప్రేక్షకులను అలరించింది. తప్పకుండా ఈ సినిమాకు ఆస్కార్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు.

ముఖ్యంగా కాంతార సినిమాలో రిషబ్ శెట్టి నటనకు అందరు ఫిదా అయ్యారు. సినిమా క్లైమాక్స్ లో అతను చేసిన నటనకు ఎవరైనా సరే సూపర్ అనాల్సిందే. డైరెక్టర్ కమ్ యాక్టర్ గా కాంతార సినిమాకు రిషబ్ శెట్టి తన ప్రాణం పెట్టాడు. అందుకే ఆ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.