Begin typing your search above and press return to search.
తెలుగు డబ్బింగ్ చిత్రాల్లో 'కాంతార' సరికొత్త రికార్డ్..!
By: Tupaki Desk | 20 Nov 2022 2:30 AM GMT2022 లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిత్రాల్లో "కాంతార" ఒకటి. కన్నడలో ఒక చిన్న సినిమాగా విడుదలై.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. కేవలం రూ. 2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో ప్రారంభమైన ఈ సినిమా.. 50 రోజుల థియెట్రికల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ. 400 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది.
"కాంతార" సినిమా కన్నడలో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుండటంతో.. రెండు వారాల తర్వాత తెలుగు తమిళ మలయాళం హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేసారు. ఈ సినిమా అన్ని భాషలలోనూ ఊహించని వసూళ్ళు సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది.
కేవలం తెలుగులో "కాంతార" మూవీ ఇప్పటి వరకు 65 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ ఏడాది 'కేజీఎఫ్ 2' తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రెండవ అతి పెద్ద డబ్బింగ్ చిత్రంగా నిలిచింది. అంతేకాదు తెలుగులో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్ళు సాధించిన డబ్బింగ్ చిత్రాల జాబితాలో టాప్-4 గా నిలిచి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
తెలుగులో 'KGF: చాప్టర్ 2' చిత్రం రూ.185 కోట్ల వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. '2.0' సినిమా రూ.100 కోట్లు.. 'రోబో' మూవీ రూ.72 కోట్లతో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఇప్పుడు రూ. 65 కోట్లతో "కాంతారా" సినిమా 4వ స్థానంలో నిలవగా.. 57 కోట్లతో ఐదవ స్థానంలో "ఐ" చిత్రం వుంది.
తెలుగులో సత్తా చాటిన సినిమాల జాబితాలో ఇప్పటి వరకు తమిళ చిత్రాలే ఉండగా.. ఈ యేడాది రెండు కన్నడ చిత్రాలు టాప్-5 లోకి రావడం గమనార్హం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన "కాంతార" సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవడం మామూలు విషయం కాదు.
ఇకపోతే 'కాంతార' చిత్రం లేటెస్టుగా 'KGF 2' కలెక్షన్స్ ని బీట్ చేసి, కన్నడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అలానే హిందీలో ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 80 కోట్లు వసూలు చేసింది. ఫైనల్ రన్ ముగిసే నాటికి ఈ డివైన్ బ్లాక్ బస్టర్ ఎలాంటి నంబర్స్ ని నమోదు చేస్తుందో చూడాలి.
కాగా, శాండిల్ వుడ్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ''కాంతారా'' సినిమా తెరకెక్కింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు.
కన్నడ సంస్కృతులు, సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో రిషబ్ శెట్టి తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆయనకు జోడీగా సప్తమి గౌడ నటించింది. అచ్యుత్ కుమార్ - కిషోర్ కుమార్ - సుచాన్ శెట్టి - ప్రమోద్ శెట్టి - ప్రకాష్ ఇతర పాత్రలు పోషించారు. అజనీశ్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.
"కాంతారా" చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నవంబర్ 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.