Begin typing your search above and press return to search.
దీపావళి క్లాష్ లో.. కాంతార చిచ్చు!
By: Tupaki Desk | 23 Oct 2022 3:40 PM GMTసినిమా పరిశ్రమలో పెద్ద సినిమాలు లేదా చిన్న సినిమాలు ఏమైనా సరే పండగ సందర్భంగా విడుదలయితే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటూ ఉంటాయి. అయితే అందులో దీపావళికి కూడా చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగుతూ ఉంటాయి. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా పండుగ సీజన్లో పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఈసారి దీపావళి సందర్భంగా కూడా ఒకేసారి నాలుగు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
తమిళ హీరోలు శివ కార్తికేయన్ కార్తీ ఇద్దరు కూడా ప్రిన్స్ సర్దార్ లతో రెండు భాషల్లో పోటీపడ్డారు. ఇక తెలుగులో అయితే విశ్వక్సేన్ తమిళ రీమేక్ మూవీ ఓరి దేవుడా! విడుదలవగా.. మంచి హీరో విష్ణు నుంచి వచ్చిన జిన్నా సినిమా కూడా లిమిటెడ్ థియేటర్లలో దీపావళికి విడుదలైంది. అయితే ఈ రెండు సినిమాలకు మొదటి రోజు ఆశ్చర్యపరిచే విధంగా అయితే కలెక్షన్ ఏమి రాలేదు.
ఒక విధంగా కార్తీ సర్దార్ సినిమా మాత్రమే పాజిటివ్ టాక్ తో రెండవ రోజు కలెక్షన్స్ పెంచుకుంది. అయితే వీటన్నిటి లెక్క ఒక విధంగా ఉంటే ఎప్పుడో వారం క్రితం విడుదలైన కాంతార సినిమా మాత్రం ఒక్కసారిగా చిచ్చు రాజేసినట్లు అనిపిస్తోంది. ఈ సినిమాకు శనివారం రోజు వచ్చిన మొత్తం కలెక్షన్స్ తో మిగతా సినిమాలకు షాక్ ఇచ్చింది.
ఎనిమిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా షేర్ కలెక్షన్స్ అందుకుంది. దీపావళికి సందర్భంగా విడుదలైన సినిమాల కలెక్షన్స్ కంటే శనివారం రోజు అత్యధిక స్థాయిలో కలెక్షన్ కాంతారనే అందుకోవడం విశేషం. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కాంతార మిగతా రాష్ట్రంలో కూడా మంచి కలెక్షన్స్ అందుకుంటుంది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ప్రభావం గట్టిగానే చూపించింది.
మిగతా సినిమాలను కోలుకోలేని విధంగా కాంతార బాక్స్ ఆఫీస్ వద్ద దెబ్బకొట్టింది. అసలైతే కొత్త సినిమాలకు ఈ రేంజ్ లో కాంతార సినిమా పోటీ ఇస్తుంది అని ఎవరు అనుకోలేదు. ఏదో ఒక రెండు మూడు రోజుల హడావిడి చేసి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఈ దీపావళి మొత్తం కాంతార సినిమా డామినేట్ చేసే విధంగా ఉంది. మరి ఆ పోటీని తట్టుకొని దీపావళిపై ఆశతో వచ్చిన కొత్త సినిమాలు ఎంతవరకు కలెక్షన్స్ అందుకుంటాయో చూడాలి.