Begin typing your search above and press return to search.

బ‌న్నీ రికార్డ్ ని తుడిచి పెట్టేసిందిగా!

By:  Tupaki Desk   |   10 Nov 2022 2:30 PM GMT
బ‌న్నీ రికార్డ్ ని తుడిచి పెట్టేసిందిగా!
X
క‌న్న‌డ సినిమా అంటే గ‌తంలో ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకునే వారు కాదు. కానీ టైమ్ మారింది. య‌ష్ న‌టించిన `కేజీఎఫ్`తో క‌న్న‌డ సినిమాల‌కు కొత్త క‌ళ మొద‌లైంది. దేశ వ్యాప్తంగా క‌న్న‌డ సినిమా గురించి అంతా గొప్ప‌గా చెప్పుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఆ త‌రువాత వ‌చ్చిన `కేజీఎఫ్ 2` సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా ఊహిచ‌ని విధంగా హిందీ మార్కెట్ లో రూ. 434 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి అక్క‌డి వారిని విస్మ‌య ప‌రిచింది. ఇక అన్ని భాష‌ల్లోనూ రికార్డు స్థాయిలో డ్రీమ్ ర‌న్ ని కొన‌సాగించి రూ. 1200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది.

ఇక్క‌డితో క‌న్న‌డ సినిమా ప్ర‌భంజ‌నం ఆగిపోలేదు. ఆ త‌రువాత కూడా అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. చార్లీ 777, విక్రాంత్ రోణ వంటి సినిమాలు భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి క‌న్న‌డ సినిమా స‌త్తా ఏంటో చూపించాయి. ఈ సినిమాల త‌రువాత సైలెంట్ గా విడుద‌లై సంచ‌ల‌నాలు సృష్టించ‌డం మొద‌లు పెట్టింది `కాంతార‌`. రిష‌బ్ శెట్టి హీరోగా, ద‌ర్శ‌కుడిగా రూపొందించిన ఈ మూవీ క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో డ్రీమ్ ర‌న్ ని కొన‌సాగిస్తూ ఊహించ‌ని నంబ‌ర్ల‌ని అధిగ‌మిస్తూ క్రేజీ సినిమాల రికార్డుల్ని తుడిచి పెట్టేస్తోంది.

కేజీఎఫ్ మేక‌ర్స్ హోంబ‌లే ఫిలింస్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ తెలుగులో దాదాపుగా రూ. 60 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఇక హిందీలోనూ కేజీఎఫ్ 2 త‌ర‌హాలోనూ దూసుకుపోతోంది. 27 రోజుల‌కు గానూ హిందీలో రూ. 67 కోట్లు వ‌సూలు చేయ‌డం విశేషం. క‌ర్ణాట‌క‌లోని భూత‌కోల నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీకి ప్రేక్ష‌కులు భాషా బేధం లేకుండా అన్ని భాష‌ల్లోనూ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీంతో ఈ మూవీ ఊహించ‌ని విధంగా వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ ట్రేడ్ పండితుల్ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

సినిమా విడుద‌లై ఐదు వారాల‌వుతున్నా ఎక్క‌డా జోరు త‌గ్గ‌డం లేదు. క‌న్న‌డ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో ఒకే జోరు చూపిస్తూ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రూ.350 కోట్ల గ్రాస్ ని వ‌సూలు చేయ‌డం విశేషం. బ‌న్నీ న‌టించిన `పుష్ప‌` లైఫ్ టైమ్ ర‌న్ లో 350 కోట్లు వ‌సూలు చేసింది. ఆ వ‌సూళ్ల‌ని `కాంతార` త‌క్కువ రోజుల్లోనే అధిగ‌మించ‌డం విశేషం.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ అన్ని భాష‌ల్లో క‌లిపి వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 355 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం రికార్డు గా తెలుస్తోంది. ఒక చిన్న సినిమాగా విడుద‌లై సైలెంట్ గా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ స‌రికొత్త రికార్డుల్ని సృష్టిస్తుండ‌టంతో త్వ‌ర‌లోనే ఈ మూవీ మ్యాజిక్ ఫిగ‌ర్ ని దాట‌డం ఖాయం అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.