Begin typing your search above and press return to search.
హిందీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ..!
By: Tupaki Desk | 7 Oct 2022 1:30 AM GMTఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'బెల్ బాటమ్' 'హీరో' వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ హీరో రిషబ్ శెట్టి. 'గరుడ గమన వృషభ వాహన' సినిమాతో సంచలనం సృష్టించిన రిషబ్.. ఇప్పుడు ''కాంతారా'' చిత్రంతో కన్నడ సీమలో ప్రభంజనం సృష్టిస్తున్నాడు.
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ మూవీ 'కాంతారా' ఇటీవలే థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. కన్నడ సంస్కృతులు, సంప్రదాయాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రిషబ్ తన దర్శకత్వ ప్రతిభ మరియు నటనతో మెస్మరైజ్ చేసాడు.
'కేజీఎఫ్' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని, ప్రస్తుతం ప్రభాస్ తో 'సలార్' సినిమా చేస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్.. ''కాంతారా'' చిత్రాన్ని నిర్మించింది. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించే జోరుగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. ఇది తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
అయితే ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏంటంటే.. దేశవ్యాప్తంగా 'కాంతారా' గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా హిందీలో ఈ బ్లాక్ బస్టర్ మూవీని రిలీజ్ చేస్తున్నారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించిన నిర్మాత హోంబలే విజయ్ కిరగందూర్.. 'కాంతారా' హిందీ పోస్టర్ ను ఆవిష్కరించారు. అలానే ట్రైలర్ అప్డేట్ ను అందించారు. ఇదే క్రమంలో మిగతా భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలిసే అవకాశం ఉంది.
'కాంతారా' కథేంటంటే.. కర్ణాటకలోని కోస్టల్ ఏరియాలోని దట్టమైన అడవిలో జీవనం సాగించే సాధారణ యువకుడు.. ప్రకృతి ప్రసాదించిన అడవి తల్లి ఒడిలో పుట్టి పెరిగి ఫారెస్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. అయితే వారు జీవించే అటవీ ప్రాంతాన్ని కబలించేందుకు ఓ రాజకీయ నేత భూస్వామి మరియు ఫారెస్ట్ అధికారి మురళి కుట్రలు పన్నుతారు. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు ఎలా గుణపాఠం చెప్పాడు అనేది ఈ సినిమా కథ.
కథగా చెప్పడానికి, వినడానికి చాలా సింపుల్ గా ఉన్నా.. ఇందులో బలమైన భావోద్వేగాయాలు ఉంటాయి. అటవీ ప్రాంతంలో నివసించే ప్రజల ప్రేమ, అభిమానం, అమాయకత్వం అన్నీ గుండెను తాకాతాయి. ఇది సినిమా కాదు.. కన్నడిగుల గర్వకారణమని పేర్కొంటున్నారు.
ఈ రూరల్ డ్రామాలో రిషబ్ శెట్టి అద్భుతమైన నటన కనబర్చగా.. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. అచ్యుత్ కుమార్ - కిషోర్ కుమార్ - సుచాన్ శెట్టి - ప్రమోద్ శెట్టి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.