Begin typing your search above and press return to search.
బాక్సాఫీస్ వద్ద అగ్రతాంబూలం ఆ మూవీకే!
By: Tupaki Desk | 17 Oct 2022 1:41 PM GMTకరోనా తరువాత అన్నీ మారినట్టే సగటు సినీ లవర్ నాడీ కూడా మారింది. కథకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ స్టార్స్ తో సంబంధం లేకుండా కథ, కథనాలు నచ్చితే చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడకుండా బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో కంటెంట్ వున్న సినిమాలకే అగ్రతాంబూలం ఇస్తున్నారు. ప్రస్తుతం చిన్న సినిమాగా విడుదలైన కన్నడ అనువాద చిత్రం 'కాంతారా' అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ విస్మయానికి గురిచేస్తోంది.
కన్నడ నేటి విటీ నేపథ్యంలో రూపొందినా తెలుగు ప్రేక్షకుల్ని ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంటూ మంచి వసూళ్లని రాబడుతోంది. తొలి రోజు మౌత్ టాక్ తో మొదలైన ఈ మూవీ మూడు రోజుల్లోనూ అనూహ్యంగా పుంజుకుని ఇప్పడు అన్ని సినిమాలని వెనక్కి నెట్టి టాప్ లో ట్రెండ్ అవుతోంది.
ఈ మూవీ తరువాతి స్థానంలో మెగాస్టార్ నటించిన 'గాడ్ ఫాదర్' నిలవడం గమనార్హం. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ కలిసి చేసిన 'లూసీఫర్' కు రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార నటించారు. అయినా సరే ఈ మూవీ 'కాంతారా'ని బీట్ చేయలేకపోతోంది.
రెండు వారాలు దాటినా ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ ని సాధించకపోవడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది. ఇక అక్టోబర్ 14న ఆది సాయికుమార్ నటించిన 'క్రేజీ ఫెలో' విడుదలైంది. కె. కె. రాధామోహన్ నిర్మించిన ఈ మూవీలో దిగాంగన సూర్యవన్షీ, మిర్నా మేనన్ హీరోయిన్ లుగా నటించారు. ఆది కి హిట్టు పడి చాలా కాలం అవుతున్న నేపథ్యంలో ఈ మూవీ తో అయినా సక్సెస్ అవుతాడని అంతా అనుకున్నారు కానీ జరగలేదు సరికదా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజైనట్టుగా కూడా ఎవరికీ తెలియకపోవడంతో అడ్రస్ లేకుండా పోయింది.
ఇక చిన్న హీరో నటించిన 'బాయ్ ఫ్రెండ్ హైర్' ఆరంభ శూరత్వం తప్ప సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ దారుణంగా తిరస్కరించారు. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో విశ్వాంత్ హీరోగా నటించగా మాళవిక హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ డే ఫస్ట్ షోకే ఈ మూవీ డిజాస్టర్ అని తేలడంతో ఈ సినిమా థియేటర్ల వంక ఎవరూ తొంగి చూడటం లేదు.
ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్ 1' మాత్రం మంచి టాక్ తో రన్నవుతోంది. చాలా వరకు ఈ మూవీపై నెగెటివ్ టాక్ వినిపించినా వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద మాత్రం అదేమీ కనిపించడం లేదు. సినిమా డిజాస్టర్ అని ప్రచారం చేసినా ఆ టాక్ కు భిన్నంగా ఆకట్టుకుంటూ మంచి వసూళ్లని రాబడుతోంది. బ్రేక్ ఈవెన్ ని అతి కష్టం మీద సాధించిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఫరవాలేదనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.