Begin typing your search above and press return to search.

కాంతార ఓటీటీ.. నిర్మాతకు షాక్ ఇచ్చిన అమెజాన్!

By:  Tupaki Desk   |   25 Nov 2022 1:30 PM GMT
కాంతార ఓటీటీ.. నిర్మాతకు షాక్ ఇచ్చిన అమెజాన్!
X
కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన కాంతార సినిమా ఓ మోస్తారుగా సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఆ సినిమా ఊహించిన విధంగా సొంత భాషలో మొదటి వీకెండ్ లోనే పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి తీసుకొచ్చేసింది. అంతేకాకుండా వారం జరిగేసరికి మిగతా భాషల్లో దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమా పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి తీసుకువచ్చేసింది.

అసలు పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాను విడుదల చేయొద్దు అనుకున్నారు. కానీ సినిమా కంటెంట్ జనాలకు కనెక్ట్ కావడంతో పెద్దగా ప్రమోషన్ చేయకుండానే భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి ప్రాఫిట్ అందజేయడం విశేషం. అయితే ఈ సినిమా థియేట్రికల్ గా కూడా మంచి లాభాలను సొంతం చేసుకుంది. ఇక అమెజాన్ ప్రైమ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కు సంబంధించిన అన్ని భాషల ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఇటీవల ఓటీటీ లో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు ఎంతో ఆయువు పట్టుగా నిలిచినటువంటి వరాహ రూపం అనే పాట మాత్రం సినిమాలో కనిపించకపోవడంతో ఓటీడీ ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ సినిమా వరహరూపం పాట ట్యూన్ ను అనుమతులు లేకుండా కాపీ కొట్టారు అంటూ కేరళకు చెందిన ఒక మ్యూజిక్ బ్యాండ్ కోర్ట్ లో కేసు వేసింది. దీంతో పాటను మరికొన్ని రోజులు ఓటీటీ లో కూడా ప్రసారం చేయడానికి వీలులేదు అని స్టే తీసుకోవచ్చారు.

అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, హోంబెల్ ఫిలిమ్స్ కు కోత విధించినట్లుగా తెలుస్తోంది. సినిమాలో అసలైన కంటెంట్ లేకపోవడంతో 25% వరకు ఓటీటీ డీల్ లో పేమెంట్ తగ్గించినట్లుగా తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం పూర్తిస్థాయిలో కంటెంట్ ఇవ్వలేదు కాబట్టి నిబంధనల ప్రకారం ఆ కోత విధించారు.

అది కూడా కొంతవరకు గడువు మాత్రమే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆలోపు కోర్టు సమస్యలన్నీ తేల్చుకుని ముందుగా ఒప్పుకున్న డీల్ ప్రకారం సినిమా కంటెంట్ మొత్తాన్ని ఓటీడీకి ఇవ్వాలి అని వాళ్ళు హెచ్చరించినట్లు సమాచారం. మరి ఈ విషయంలో హోంబెల్ ఫిలిమ్స్ వారు ఏ విధంగా అడుగులు వేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.