Begin typing your search above and press return to search.
'కాంతార' స్టార్ ప్రాంతీయాభిమానంకు హ్యాట్సాఫ్
By: Tupaki Desk | 23 Oct 2022 9:40 AM GMTకన్నడ స్టార్ రిషబ్ శెట్టి తాజా చిత్రం కాంతార ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కాంతార ఫీవర్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ వారం కూడా కాంతార సినిమా వసూళ్ల జాతర కొనసాగుతుంది అంటే ఏ స్థాయిలో ఆ సినిమా సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
రిషబ్ శెట్టి కాంతార సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దాంతో ఆయన తో సినిమాలను తెరకెక్కించేందుకు దేశ వ్యాప్తంగా పలువురు స్టార్ ఫిల్మ్ మేకర్స్ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఆయన మాత్రం కన్నడంలో మాత్రమే సినిమాలు చేస్తాను అంటూ ఫుల్ క్లారిటీగా చెప్పేశాడు.
తాజాగా ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంతార స్టార్ రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. తాను భవిష్యత్తు లో వేరే భాషలో సినిమాలు చేస్తానంటూ కొందరు భావిస్తున్నారు. కానీ తాను ఎప్పటికి కన్నడంలోనే సినిమాలు చేస్తాను. ఆ సినిమాలను ఇతర భాషలకు డబ్ చేసి అక్కడ కన్నడ సినిమాలకు మంచి పాపులారిటీ వచ్చేలా చేయాలనుకుంటున్నాను అన్నట్లుగా పేర్కొన్నాడు.
కాంతార సినిమా కన్నడంతో పాటు తెలుగు ఇతర భాషల్లో సాధిస్తున్న వసూళ్లు చూస్తూ ఉంటే కేజీఎఫ్ సినిమా దిగదుడుపే అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమాలు వందల కోట్ల వసూళ్లను రాబట్టడం పెద్ద విశేషం కాదు. కానీ చిన్న సినిమా గా రూపొంది వందల కోట్ల వసూళ్లు దక్కించుకోవడం అనేది చాలా పెద్ద విషయం అంటున్నారు. కాంతార వంటి సినిమాలు అన్ని భాషల్లో రావాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.