Begin typing your search above and press return to search.

'కాంతార' రూటే సపరేటు.. డైరెక్టర్ సంచలన కామెంట్స్..!

By:  Tupaki Desk   |   31 Oct 2022 12:30 PM GMT
కాంతార రూటే సపరేటు.. డైరెక్టర్ సంచలన కామెంట్స్..!
X
'కాంతార' విడుదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. దర్శకుడు తనలోని హీరోయిజాన్ని తెరపై ప్రదర్శిస్తే ఎలాంటి అవుట్ పుట్ వస్తుంది? అనడానికి ఈ చిత్రం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది. కన్నడలో తెరకెక్కిన 'కాంతార' మూవీ తెలుగు రాష్ట్రాలతోపాటు హిందీలోనూ భారీగా వసూళ్లు రాబడుతూ దూసుకెళుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ మూవీకి 200 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. కన్నడ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన కేజీఎఫ్-1 రికార్డుకు చేరువలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే కేజీఎఫ్-1 రికార్డును 'కాంతార' త్వరలోనే బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా విజయవంతం కావడంపై దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

'కాంతార' చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. తెలుగు కన్నడ తమిళ్ మలయాళం హిందీ భాషల్లో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. హిందీ బెల్టులో ఈ సినిమాకు ఎక్కువగా ప్రమోషన్ చేయనప్పటికీ మౌత్ టాక్ ద్వారానే 'కాంతార' మంచి వసూళ్లను రాబట్టింది. 'కాంతార' కథ రీత్యా ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసే ఛాన్స్ పుష్కలంగా ఉంది.

ఒక భాషలో తెరకెక్కి ఇతర భాషలోకి డబ్బింగ్ చేయబడిన పలు చిత్రాలను సైతం ఇటీవల కాలంలో రీమేక్ చేస్తూ దర్శక, నిర్మాతలు హిట్ కొడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' ఇలా కోవలోకే వస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్' తెలుగులో డబ్బింగ్ అయింది. అయినప్పటికీ ఈ మూవీని తెలుగులో 'గాడ్ ఫాదర్' గా దర్శకుడు మోహన్ రాజా రీమేక్ చేసి విజయం సాధించారు.

ఇలానే హిందీలోనూ 'కాంతార'కు రీమేక్ చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై దర్శకుడు కమ్ రిషబ్ శెట్టి విభిన్నంగా స్పందించాడు. హిందీలో ఈ చిత్రానికి న్యాయం చేయగలిగే హీరోలు చాలామందే ఉన్నారని తెలిపారు. అయితే రీమేక్ అనే కాన్సెప్ట్ తనకు పెద్దగా నచ్చదని రిషబ్ శెట్టి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

ఒరిజినల్ దర్శకుడే 'కాంతార'ను రీమేక్ పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో హిందీలో ఈ సినిమా రావడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ సినిమాను ఆస్కార్ కి నామినేట్ చేయాలని నెటిజన్లు కోరుతుండటాన్ని రిషబ్ శెట్టి స్వాగతించారు. అభిమానులు చూపిస్తున్న ఆదరణ తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. అయితే తాను ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించే టైపు కాదని స్పష్టం చేశాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.