Begin typing your search above and press return to search.

కాంతార స్టార్‌ రూ.25 కోట్ల నుండి రూ.100 కోట్లకు...!

By:  Tupaki Desk   |   10 Dec 2022 8:02 AM GMT
కాంతార స్టార్‌ రూ.25 కోట్ల నుండి రూ.100 కోట్లకు...!
X
కన్నడ స్టార్‌ రిషబ్ శెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌ హీరో అయ్యాడు. కాంతార సినిమా తో రిషబ్ శెట్టికి దేశ వ్యాప్తంగా అభిమానులు అయ్యారు. కన్నడంలో రూపొందిన కాంతార సినిమా దేశంలోని అన్ని భాషల్లో కూడా డబ్ అయ్యి విడుదలైంది. అన్ని చోట్ల కూడా భారీ కలెక్షన్స్ ను ఈ సినిమా రాబట్టడంతో దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఈ సినిమా నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

కాంతార సినిమాను పాతిక కోట్ల లోపు బడ్జెట్‌ తోనే రిషబ్ శెట్టి పూర్తి చేశాడు. ఈ సినిమాలో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి తదుపరి సినిమా ఏమై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోసారి కాంతార రేంజ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రిషబ్ శెట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట.

కన్నడ సినిమా స్థాయి ఇప్పుడు విపరీతంగా పెరిగింది. కేజీఎఫ్ రెండు పార్ట్‌ ల తర్వాత కాంతార సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇక నుండి అక్కడ విడుదల అయ్యే అన్ని సినిమాలు కూడా ఇతర భాషల్లో డబ్‌ అయ్యే అవకాశం ఉంది.

రిషబ్ షెట్టికి పాన్ ఇండియా స్టార్‌ డమ్ దక్కడంతో ఆయన తదుపరి సినిమా కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అందుకే రిషబ్ శెట్టి తదుపరి సినిమా విషయంలో కాస్త ఎక్కువ సీరియస్ గా ఉన్నాడంటూ కన్నడ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

తాజాగా కన్నడ మీడియా సంస్థలు కొన్ని రిషబ్ శెట్టి యొక్క తదుపరి సినిమా గురించి కథనాలు రాస్తున్నాయి. అందులో రిషబ్ శెట్టి యొక్క తదుపరి సినిమా బడ్జెట్‌ దాదాపుగా వంద కోట్లు ఉండబోతుందని.. పాన్ ఇండియా రేంజ్ లో ఆకట్టుకునే విధంగా మంచి స్క్రిప్ట్‌ తో రిషబ్ రాబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.

రిషబ్ శెట్టి కాంతార సినిమా ను 25 కోట్ల లోపు బడ్జెట్‌ తో రూపొందించి దాదాపుగా రూ.400 కోట్ల వసూళ్లు దక్కించుకున్నాడు. కనుక ఆయన నుండి వంద కోట్ల సినిమా వస్తే కచ్చితంగా అది కూడా కాంతార సినిమా స్థాయిలో ఉంటుందనే నమ్మకం ను కన్నడ మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.