Begin typing your search above and press return to search.

'వరాహ రూపం'.. 'కాంతారా' నుంచి ఒళ్ళు గగుర్పొడిచే గీతం..!

By:  Tupaki Desk   |   21 Oct 2022 3:36 AM GMT
వరాహ రూపం.. కాంతారా నుంచి ఒళ్ళు గగుర్పొడిచే గీతం..!
X
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ''కాంతారా'' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేయగా.. ఐదు రోజుల్లో 22 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

కన్నడ సంస్కృతులు, సంప్రదాయాల నేపథ్యంలో 'కాంతారా' సినిమా రూపొందింది. ఇందులో రిషబ్ శెట్టి తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషబ్ రూపకం మరియు అతని నటనను చూసి ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు.

పతాక సన్నివేశాల్లో ఒళ్ళు గగుర్పాటుకు గురి చేయడమే కాదు.. ఉద్వేగానికి గురి చేస్తున్న 'వరాహరూపం' పాటకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. అలాంటి నృత్య రూపకాన్ని ఎలా తీశారో చెబుతూ మేకర్స్ లేటెస్టుగా ఆ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

'వరాహరూపం.. దైవ వరిష్ఠం' పాటను రూపొందించడానికి టీమ్ అంతా ఎంత కష్టపడ్డారు అనేది ఈ వీడియోలో చూడొచ్చు. దీనికి అజనీశ్ లోకనాథ్ ట్యూన్ కంపోజ్ చేశారు. శశి రాజ్ కవూర్ ఈ గీతానికి సాహిత్యం అందించగా.. సాయి విఘ్నేష్ ఆలపించారు.

సాంప్రదాయ వాయిద్యాలతో సంగీత దర్శకుడు దీనికి స్వరాలు సమకూర్చారు. ఆ పాటను రిషబ్ శెట్టి చిత్రీకరిస్తున్న విధానం.. వివిధ నటులు కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. అందరినీ డివోషనల్ లోకి తీసుకెళ్లే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఇది ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది.

ఇకపోతే 'కాంతారా' క్లైమాక్స్ సన్నివేశాలను కేవలం ఐదు రాత్రుల్లో తీర్చిదిద్దారు రిషబ్ శెట్టి. రెస్ట్ లేకుండా షూటింగ్ చేసినా.. దైవం ఆవహించిన సన్నివేశాల్లో అలసట ఏమాత్రం కనిపించనీయకుండా నటించిన విధానం మెప్పిస్తోంది.

అయితే ఆ సీన్స్ ని తెరకెక్కించేటప్పుడు ఉపవాసం చేశారట. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగి, షూటింగ్ చేసేవారట. క్లైమాక్స్ లో తాను నటించే సన్నివేశాల చిత్రీకరణ కోసం తన మిత్రుడు, దర్శకుడు రాజ్ బి. శెట్టి సహాయం తీసుకున్నారు రిషబ్. ఎంతో నిబద్ధతతో ఏకాగ్రత, అంకితభావంతో చేసాం కాబట్టే క్లయిమాక్స్ అలా వచ్చిందని రిషబ్ పేర్కొన్నారు.

'కాంతారా' సినిమాలో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. అచ్యుత్ కుమార్ - కిషోర్ కుమార్ - సుచాన్ శెట్టి - ప్రమోద్ శెట్టి - ప్రకాష్ ఇతర పాత్రలు పోషించారు. 'కేజీఎఫ్‌' మేకర్స్ తమ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.