Begin typing your search above and press return to search.
కాంతార 5 డేస్ కలెక్షన్స్.. లాభాల్లో తగ్గేదేలే!
By: Tupaki Desk | 20 Oct 2022 7:30 AM GMTనిర్మాత అల్లు అరవింద్ ఎలాంటి సినిమాను తెరపైకి తీసుకువచ్చినా కూడా అందులో మినిమం కంటెంట్ ఉండే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా దర్శకులను నటినటుల టాలెంట్ ను కూడా ఆయన చాలా చక్కగా ఉపయోగించుకునే విధంగా ప్లాన్ కూడా ఇస్తూ ఉంటారు. ఇక కాంతార సినిమాను ఆయన తెలుగులో విడుదల చేయడం మొదట్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అసలైతే కాంతార సినిమాను కన్నడలో విడుదలకు చేయకంటే ముందే తెలుగులో కూడా విడుదల చేయాలని హోంబెల్ ఫిలిమ్స్ వారు అనుకున్నారు.
కానీ విడుదల తర్వాత కన్నడంలో భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో తెలుగులో ఇది వర్కౌట్ కాదేమో అని కొంతమంది అనుకున్నారు. కానీ నిర్మాత అల్లు అరవింద్ మాత్రం ప్రత్యేకంగా హోంబెల్ ఫిలిమ్స్ తో మాట్లాడి తెలుగులో కూడా ఈ సినిమాను కొన్ని లిమిటెడ్ థియేటర్లలో విడుదల చేశారు.
ఇక రోజు రోజుకి థియేటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కేవలం రెండు కోట్ల హక్కులతోనే ఆ సినిమాను తెలుగు లో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు సినిమా పెట్టిన పెట్టుబడికి మూడింతల లాభాలను అందిస్తోంది. ఐదు రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 9.61 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ సాధించింది. 18.25 కోట్ల గ్రస్స్ వచ్చింది. అంటే పెట్టిన పెట్టుబడికి సినిమా ఇప్పటివరకు 7.31 కోట్ల వరకు ప్రాఫిట్ అయితే అందించింది.
ఇక దీపావళి కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 20 రోజుల్లో దాదాపు 130 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ 150 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇక కాంతర సినిమా చూసిన తర్వాత నిర్మాత అల్లు అరవింద్ అయితే మరోసారి దర్శకుడు కథానాయకుడు అయినటువంటి రిషబ్ కి అవకాశం ఇవ్వాలి అని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. గీత ఆర్ట్స్ లోనే అతనితో ఒక బిగ్ బడ్జెట్ సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. మరి అతను తెలుగులో పెద్ద సినిమాతో ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.