Begin typing your search above and press return to search.
మణిశర్మ సిసలైన మాయ ఇదే
By: Tupaki Desk | 6 May 2017 5:11 PM GMT''కనులేమిటో.. నిదురేమిటో.. కలలేమిటో.. ఈ కథ ఏంటో!! మనసేమిటో పలుకేమిటో అలకేమిటో.. ఈ కులుకేంటో!!'' అంటూ సాగే ఒక మెలోడియస్ సాంగ్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను తెగ ఊరిస్తోంది. ఇంతకీ ఈ పాట ఏ సినిమాలోది? ''ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్'' సినిమాలోది. పసలపూడి వంశీ ఎంతో ఛాలెంజింగ్ గా తను తీసిన ''లేడీస్ టైలర్'' కు సీక్వెల్ ను తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఊపిరినిచ్చే పాట ఇదే అంటే ఆశ్చర్యం వేస్తుందేమో కాని.. అది నిజమే.
ఇప్పటివరకు ఈ సినిమా కోసం మణిశర్మ కంపోజ్ చేసిన బాణీలన్నీ ఒకెత్తయితే.. ఇప్పుడు ఈ పాట మాత్రం మరో ఎత్తు అనే చెప్పాలి. ముఖ్యంగా వంశీ ఈసారి చాలా కలర్ ఫుల్ లుక్స్ తో ఈ పాటను పిక్చరైజ్ చేసిన తీరు బాగుంది. బ్లూస్ రెడ్స్ గ్రీన్స్ అంటూ ఒక్కొక్క థీమ్ కలర్ లో ఈ పాటను బాగా తీశాడు. అయితే ఈయన పెట్టిన కెమెరా బ్లాకులను ఇప్పుడు మణి అందించిన బాణి డామినేట్ చేస్తోంది. గతంలో మృగరాజు వంటి సినిమాలో హే శతమానమన్నదిలే అంటూ రొమాన్స్ రాగాలను పండించిన మణిశర్మ.. ఒక్కసారిగా తనలోని అటువంటి వింటేజ్ కంపోజర్ ను బయటకు తెచ్చాడు.
చాలాసార్లు సినిమాలో ఒక్క పాట సూపర్ హిట్టయినా కూడా సినిమాకు అత్యధ్బుతమైన క్రేజ్ వస్తుంది. మరి ఈ పాటతో వంశీ కొత్త సినిమా స్థితిగతులు ఎలా మారిపోతాయో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/