Begin typing your search above and press return to search.

కపిల్ దేవ్ మెచ్చిన ‘రేసుగుర్రం’

By:  Tupaki Desk   |   1 Oct 2015 9:22 AM IST
కపిల్ దేవ్ మెచ్చిన ‘రేసుగుర్రం’
X
కపిల్ దేవ్ ఏంటి.. ఆయనకు రేసుగుర్రం నచ్చడమేంటి.. అస్సలు లింక్ కుదురుతున్నట్లు లేదు కదా. అల్లు అర్జున్ కూడా అలాగే ఆశ్చర్యపోయాడు మరి. దేశానికి తొలి ప్రపంచకప్ అందించిన గ్రేట్ కెప్టెన్ ను కలవడమే అదృష్టంగా భావిస్తే.. ఆయన తన సినిమాల గురించి మాట్లాడేసరికి డంగైపోయాడు మన స్టైలిష్ స్టార్.

ఎక్కడ కలిసింది ఎలా కలిసింది చెప్పలేదు కానీ.. ఓ స్టార్ హోటల్లో కపిల్ దేవ్ తో కలిసి తాను, తన భార్య స్నేహ కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు అల్లు అర్జున్. చాలా సింపుల్ గా.. హంబుల్ గా.. ఉండే ఇండియన్ గ్రేట్ కెప్టెన్ ను కలవడం చాలా సంతోషమని.. ఆయన సెన్సాఫ్ హ్యూమర్ కేక అని చెప్పిన బన్నీ.. ‘రేసుగుర్రం’ సినిమాలో తన పెర్ఫామెన్స్ గురించి కపిల్ చెప్పేసరికి ఆశ్చర్యపోయానన్నాడు.

ఇంతకీ ‘రేసుగుర్రం’ సినిమాను కపిల్ ఎక్కడ చూశాడా అని ఆశ్చర్యం కలుగుతోంది కదా. బన్నీ కూడా ఇలాగే ఆశ్చర్యపోయాడట. ఐతే సెట్ మ్యాక్స్ ఛానెల్లో వచ్చే సౌత్ ఇండియన్ మూవీస్ అన్నీ చూస్తానని చెప్పాడట కమల్. అలా రేసుగుర్రం సినిమా చూశానని.. అందులో తన పెర్ఫామెన్స్ బాగుందని కితాబిచ్చాడట కపిల్. ఇంకేముంది స్టైలిష్ స్టార్ ఆనందానికి అవధులే లేవు. దీన్ని గొప్ప గౌరవంగా భావిస్తానని ట్వీటాడు బన్నీ.