Begin typing your search above and press return to search.

షారుఖ్ తర్వాత కపిల్ శర్మనే

By:  Tupaki Desk   |   3 March 2018 5:22 AM GMT
షారుఖ్ తర్వాత కపిల్ శర్మనే
X
కపిల్ శర్మ. హింది ఛానల్స్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు పరిచయం అక్కర్లేని పేరు. కామెడీ రియాలిటీ షోలతో అంతు లేని పాపులారిటీ తెచ్చుకుని బాలీవుడ్ హీరోలకు సమానంగా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. అంతగా ఆకట్టుకునే కపిల్ శర్మ తన టైమింగ్ ని బీట్ చేసే ఆర్టిస్ట్ ని ఇంతవరకు టీవీ మీడియా వేరొకరిని తీసుకురాలేకపోయింది. ఇంతింతై అన్న సామెత తరహాలో కపిల్ శర్మ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య తన టీం మేట్ తో ఏవో విభేదాలు రావడం వల్ల మీడియాకెక్కి నానా రచ్చ చేసుకున్నాక కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న కపిల్ శర్మ మరో కొత్త తరహా వినూత్నమైన గేమ్ షో కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అందు కోసం ప్రత్యేకంగా ఒక వ్యానిటీ వ్యాన్ ని కపిల్ శర్మ తయారు చేయించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రముఖ కార్ డిజైనర్ దిలీప్ చాబ్రియాతో ప్రత్యేకంగా చేయించిన ఈ వ్యానిటీ వ్యాన్ బయట నుంచి చూస్తే కళ్ళు తిరగడం ఖాయం. లోపల ఇంటీరియర్స్ ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ వ్యాన్ ఫోటోలను కపిల్ శర్మ షేర్ చేసుకున్నాడు.ఇందులో ఎయిర్ కండీషన్ సౌకర్యం, అతి పెద్ద లాబీ, డెబ్బై ఇంచుల స్మార్ట్ త్రీ డి టీవీ, ఆటోమాటిక్ డోర్ లాక్స్, వ్యాన్ మొత్తం పగటి కాంతిని తలపించే ఎల్ఈడి బల్బులు, రిక్లైనర్ కుర్చీలు, వైఫై సౌకర్యం, వ్యాన్ నలువైపులా కవర్ చేసి హై ఎండ్ సిసి కెమెరాలు ఒకటేమిటి ఒక ఇంటిని తలపించే రేంజ్ లో కపిల్ శర్మ దీన్ని తయారు చేయించాడు. చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అంటున్నారు ఫాన్స్.

కపిల్ శర్మ కొత్త షో పేరు ఫ్యామిలీ టైం. సోనీ టీవీ కోసం ఇది షూటింగ్ చేస్తున్నాడు. ఈ సారి సెలబ్రిటీలను కాకుండా సాధారణ ఫ్యామిలీస్ ని ఇన్వైట్ చేసి వాళ్ళ మధ్య ఎంత అనుబంధం ఉందనేది సరదా సరదా గేమ్ షో ద్వారా కపిల్ ఇందులో చూపించబోతున్నాడు. 2015లో షారుఖ్ ఖాన్ తాను కొన్న ఖరీదైన వ్యానిటీ వ్యాన్ 4 కోట్ల దాకా ఖర్చు పెట్టాడు. మరి కపిల్ శర్మ ఎంత పెట్టాడో మాత్రం సీక్రెట్ గా ఉంచాడు. కింగ్ ఖాన్ తర్వాత అంత కాస్ట్లీ వ్యాన్ కపిల్ దే నట.