Begin typing your search above and press return to search.
కప్పతల్లి కప్పతల్లి.. ఊపులో ఉన్న జానపదం
By: Tupaki Desk | 4 July 2019 6:03 AM GMTవిజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా డా.రాజశేఖర్ - జీవితల రెండవ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న చిత్రం 'దొరసాని'. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ' జూలై 12 న విడుదలకు సిద్ధం అవుతోంది. సినిమా రిలీజ్ కు సమయం తక్కువ ఉండడంతో 'దొరసాని' టీమ్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. తాజాగా ఈ సినిమా నుండి 'కప్పతల్లి కప్పతల్లి' అంటూ సాగే ఒక లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.
ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు అనే సంగతి తెలిసిందే. ఈ కప్పతల్లి పాటకు సాహిత్యం అందించిన వారు పాపులర్ జానపద గీత రచయిత కం సింగర్ గోరేటి వెంకన్న. సరళమైన తెలంగాణా పదాలతో ఫోక్ స్టైల్ సాహిత్యం అందించారు. "షిటపట షిటపట షినుకుల తాళం నింగిని వంపిన సింగిడి బాణం..మత్తడి దునికిన పొంగుల హారం.. ఉరుముల మెరుపులా గుప్పెన కాలం కప్పల గంతుల పిల్లల మేళం" అంటూ సాగింది సాహిత్యం. ఈ పాటకు మంచి జోష్ ఉన్న ట్యూన్ అందించారు ప్రశాంత్ విహారి. అంతే ఊపుతో ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
వానలు కురవనప్పుడు.. వానలు రావాలని కోరుతూ పల్లెల్లో ఇప్పటికీ కప్పలకు పెళ్లి చేస్తారు. సరిగ్గా ఈ థీమ్ తో సాగుతుంది పాట. పిల్లలందరూ కప్పు గెంతులు వేస్తూ ఉంటే దొరసాని మేడ మేద ఉన్న కిటికీ నుండి ఈ తతంగం అంతా చూస్తూ ఉంటుంది. కింద ఈ కప్పగెంతుల బ్యాచ్ పక్కనే నిలబడి మన హీరో దొరసానిని చూస్తూ తన ప్రేమ వైఫై ని కనెక్ట్ చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉంటాడు. ఇంకా ఆలస్యం ఎందుకు.. కప్పలకు పెళ్లి చేస్తే వానలు వస్తాయా అంటూ మోడరన్ టెక్నలాజికల్ లాజికల్లీ ఇల్లాజికల్ రీజనింగ్ లు వెతక్కుండా పాటను ఎంజాయ్ చెయ్యండి.