Begin typing your search above and press return to search.
మనకు తెలియని ‘సంజూ’ ఎలా ఉంటాడంటే..
By: Tupaki Desk | 14 Jun 2018 2:59 PM GMTబాలీవుడ్ హీరో సంజయ్ దత్ అంటే అందరికీ ఎంతో ఇష్టం.. అతడి మంచితనాన్ని అందరూ హీరోలు పొగుడుతుంటారు. హీరోగా సంజయ్ దత్ కెరీర్ లో ఎన్ని హిట్లు ఉన్నాయో అంతే స్థాయిలో అతడి వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఉన్నాయి. సునీల్ దత్ కొడుకుగా సినీ రంగంలోకి వచ్చిన సంజయ్ దత్ జీవితంలో కీలకమైన సమయంలో దారితప్పడంతో ఎన్నో బాధలు పడ్డారు. డ్రగ్స్ కు బానిసై పతనమయ్యారు. కానీ వాటిని దాటుకొని వ్యసనాన్ని జయించి తిరిగి స్టార్ డమ్ సంపాదించాడు. సంజూ జీవితం చూస్తే ఓ మంచి గుణపాఠం.. అలాంటి హీరో జీవితాన్నే తాజాగా సినిమాగా తీశారు. అదే ‘సంజు’ పేరుతో బాలీవుడ్ లో తెరకెక్కింది..
సంజు సినిమాలో రణ్ బీర్ కపూర్... సంజయ్ దత్ పాత్రను పోషించారు. ఇందులో డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడడానికి సంజయ్ ఎంత బాధపడ్డాడనే విషయాన్ని సినిమాలో అద్భుతంగా చూపించారట.. ఆ సీన్లు కంటతడి పెట్టించే విధంగా ఉన్నాయని చూసిన వారు చెబుతున్నారు. ఈ టైంలో బ్యాక్ గ్రౌండ్ గా వచ్చే ‘కర్ హర్ మైదాన్ ఫతే’ పాట చాలా స్ఫూర్తినిస్తోందని అంటున్నారు. ‘నీ యుద్ధం నువ్వే చేయాలి. నీ ముందున్న శిఖరం నువ్వే అధిరోహించాలి. ఎక్కడా తలవంచకు. అనుకున్నది సాధించేవరకు’ అనే అర్థంతో సాగిన ఈ పాటలో సంజయ్ దత్ పడ్డ కష్టాలన్నింటిని తెలియజేశారని చెబుతున్నారు.
కర్ హర్ మైదాన్ ఫతే పాటకు విక్రమ్ మాంట్రోజ్ అందించిన సంగీతం కూడా చాలా ఉత్తేజం కలిగించింది. సుఖ్విందర్ సింగ్-శ్రేయాఘోషల్ లు ఈ పాట పాడి ప్రాణం పోశారు. ‘ఈ పాటలో రణబీర్ ను చూస్తుంటే సంజయ్ దత్ కనిపిస్తాడే తప్ప ఎక్కడా రణబీర్ కనిపించడం లేదు. ఓడి గెలవాలంటే .. పతనం నుంచి విజయానికి చేరాలంటే ఎంత శ్రమించాలో ఈ పాట చూస్తే చాలు’ అని బాలీవుడ్ జనాలు విశ్లేషిస్తున్నారు.