Begin typing your search above and press return to search.
పేరే పెట్టుబడి.. పాతిక కోట్ల రాబడి
By: Tupaki Desk | 1 Jun 2017 10:07 AM GMTపేరుదేముంది.. పేరులో ఏముంది.. అని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చేమో.. కానీ కొందరిని చూశాక.. కొన్ని విషయాలు తెలుసుకున్నాక పేరు గొప్పతనం తప్పక ఒప్పుకుని తీరాలి. సినిమా ఇండస్ట్రీలో అయితే పేరుకు ఉన్న వాల్యూ పేరుకుపోయిందనే చెప్పొచ్చు. ఒకస్థాయికి చేరాక పేరే బ్రాండ్ గా మారిపోతోంది. తెలుగు వాడైన రామ్ గోపాల్ వర్మ వన్స్ పేరు తెచ్చుకున్నాక హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఏం చెప్పినా పాపులర్ అయిపోయింది. అదంతా RGV అన్న పేరు బ్రాండ్ గా మారిపోవడం వెనకున్న మహత్యం.
పేరు పాపులారిటీయే కాదు.. పైసలు కూడా తెచ్చిపెడుతుంది. మిగతా వారి సంగతి పక్కన పెట్టినా బాలీవుడ్ లో కరణ్ జోహార్ మాత్రం ఈ విషయంలో అందరికన్నా ముందుంటాడు. తన పేరే పెట్టుబడిగా ఆయన సంపాదన ఎంతో తెలుసా.... రూ. 25 కోట్లు. అదీ ఒక్క సినిమాతో. ఆ సినిమా బాహుబలి-2. ఈ సినిమా హిందీ వెర్షన్ కు నిర్మాత కరణ్ జోహార్. హిందీలో బాహుబలి-2 దాదాపు రూ. 500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇందులో సినిమా ఒరిజినల్ నిర్మాతలకు రూ. 250 కోట్లు వస్తాయి. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ లాభాల్లో 10 పర్సెంట్ కరణ్ జోహార్ కు వెళ్తుంది. అంటే రూ. 25 కోట్లన్న మాట. హిందీ వెర్షన్ కు ఆయన పెట్టుబడి.. కేవలం కరణ్ జోహార్ అనే పేరు మాత్రమే.
బాహుబలి సినిమాని హిందీలో ప్రమోట్ చేయడానికి నిర్మాత, దర్శకులు కలిసి కరణ్ జోహార్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు. కరణ్ జోహార్ కున్న బ్రాండ్ ఇమేజ్ తో ఈ సినిమా ఈజీగా జనాలకు రీచ్ అయింది. దీంతో కలెక్షన్ల కనకవర్షం కురిసింది. అదంతా కరణ్ కు కలిసొచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/