Begin typing your search above and press return to search.
కేక పుట్టించిన ‘చిట్టి’ మాటలు
By: Tupaki Desk | 22 Nov 2016 9:57 AM GMTటెక్నాలజీని అసరాగా చేసుకొని అద్భుతాలు సృష్టించే దర్శకుల్లో శంకర్ ఒకరు. తాజాగా తాను తీస్తున్న రోబో స్వీక్వెల్ ఫస్ట్ లుక్ ను ఆదివారం ముంబయిలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించటమే కాదు.. కార్యక్రమానికి వచ్చిన వారికి ఊహించని ఒక అనుభూతిని ఇచ్చి పంపటంలో రోబో 2.0 టీం సక్సెస్ అయ్యింది.
వేదిక మొదటి వరుసలో ప్రముఖులు కూర్చున్న చోట.. సాంకేతిక మాయాజాలంతో పెద్ద కుర్చీలో త్రీడీ ఎఫెక్ట్ చిట్టిని ఆవిష్కరించారు. ఊహించని రీతిలో త్రీడీలో కనిపించిన చిట్టితో అహుతులతో పాటు..అతిధులు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేసిన ప్రముఖ నిర్మాత.. దర్శకుడు కరణ్ జోహార్ మాటలు కదిపారు. చిట్టిని పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా చిట్టిని పలు ప్రశ్నలు వేశారు.
మిమ్మల్ని డిస్మాంటిల్ చేసి మ్యూజియంలో పెట్టారుగా అన్న ప్రశ్నకు గట్టిగా నవ్వుతూ బదులిచ్చిన రోబో.. నన్ను ఎవరూ అంతం చేయలేరంటూ సమాధానం చెప్పాడు. మీ గర్ల్ ఫ్రెండ్ ఐశ్వర్యను ప్రేమించారే.. ఆ ప్రేమ ఏమైంది? అని అడగ్గా.. ‘‘అదోవిషాద గాథ’’అంటూ జీర కంఠంతో సమాధానం ఇచ్చాడు. బాలీవుడ్ కింగ్ ఎవరన్న ప్రశ్నకు.. ‘‘ది గ్రేట్ అమితాబ్ బచ్చన్’’ అని బదులిచ్చిన చిట్టి.. బాలీవుడ్ క్వీన్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ..‘‘మాధురీదీక్షిత్.. ఐశ్వర్యారాయ్.. శ్రీదేవి.. ప్రియాంక చోప్రా.. దీపికా.. కత్రినా.. కరీనా.. అనుష్కా.. రాఖీ సావంత్ అంటూ చెప్పుకుపోతే చాలామంది అని చెప్పాడు.
డీమానిటైజేషన్ (పెద్దనోట్ల రద్దు) గురించి తెలుసా అన్న ప్రశ్నకు.. ‘‘దాని గురించి మా బాస్ చెప్పగా తెలుసుకున్నా’’ అన్నచిట్టి.. ఇంతకీ బాస్ అంటే ఎవరు? వశీగరా? అని అంటే.. ‘‘నో.. శివాజీ ది బాస్’’ అంటూ బదులిచ్చాడు. ఇంతకీ ఈ సినిమా ట్యాగ్ లైన్ లో ప్రపంచం మనుషులకు మాత్రమే కాదని రాశారే? దాని అర్థమేంటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అది ఆయన్నే అడగండి..’’ అంటూ చిట్టి వేలు చూపించిన వేళ.. రజనీకాంత్ ఎంట్రీ ఇవ్వటంతో ఆడిటోరియం అదిరిపోయేలా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దటీజ్.. శంకర్ అనాలేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/