Begin typing your search above and press return to search.
బాబోయ్ మహమ్మారి.. బోనీ తర్వాత కరణ్ ఇంట్లో
By: Tupaki Desk | 26 May 2020 3:00 AM GMTఇది మామూలు మహమ్మారీ కాదు. మాయల మరాఠీలా వెంటాడి వేటాడే మహమ్మారీ. ఆదమరిస్తే అంటుకుపోయి వదలని ఫెవిక్విక్ లాంటి మహమ్మారీ. ప్రస్తుతం భారతదేశాన్ని అంతకంతకు అట్టుడికించేస్తోంది. పేద బీద ధనిక అనే తేడా లేకుండా అందరినీ చుట్టేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర- ముంబైలో విలయ తాండవం సృష్టిస్తోంది. ముంబై వర్గాల్లో సెలబ్రిటీలను కూడా ఈ మహమ్మారీ ఓ రేంజులో వెంటాడుతోంది.
ఇంతకుముందు గాయని కనిక కపూర్ కి మహమ్మారి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత వేరొక బాలీవుడ్ నటుడికి మహమ్మారి పాజిటివ్ అని తేలింది. అటుపై బోనీకపూర్ ఇంట్లో పనోళ్లలో ఇద్దరికి మహమ్మారి అంటుకోవడం కలకలం రేపింది. ఇప్పుడు కరణ్ జోహార్ వంతు. దర్శక నిర్మాత కరణ్ ఇంట్లో ఇద్దరు పనివాళ్లకు కోవిడ్ -19 ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కరణ్ జోహార్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. అతను ..అతని కుటుంబం - తల్లి హిరూ పిల్లలు యష్ - రూహి - అలాగే మిగిలిన సిబ్బంది సురక్షితంగా ఉన్నామని తెలిపారు. తమకు ఎలాంటి లక్షణాలు లేవని పనివాళ్లకు లక్షణాలు గుర్తించిన వెంటనే తమ ఇంట్లో ఒక విభాగంలో నిర్బంధంలో ఉంచి బీఎంసీ(మున్సిపాలిటీ) కి వెంటనే సమాచారం ఇచ్చామని వెల్లడించారు. నిబంధనల ప్రకారం వాటిని స్ప్రేయింగ్ చేసి క్రిమిరహితం చేశారు అని తెలిపారు.
ఇంట్లో అంతా సురక్షితంగా ఉన్నామా లేదా? అన్నది వైద్యాధికారులు పరీక్షించారు. మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి భద్రత కోసం రాబోయే 14 రోజులు స్వీయ నిర్భంధంలో ఉంటాము. ప్రతి ఒక్కరినీ రక్షించాలనే నిబద్ధతకు మేము కట్టుబడ్డాము. అధికారులు సూచించిన అన్ని చర్యలకు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నామని కరణ్ జోహార్ ఈ సందర్భంగా తెలిపారు.
కనికా కపూర్.. బోనీ కపూర్ పనివాళ్లు.. కరణ్ పనివాళ్లు.. నెక్ట్స్ ఇంకెందరిని వెంటాడుతుందో ఈ మహమ్మారీ. ఓవైపు లాక్ డౌన్ తో బాలీవుడ్ షూటింగులు అన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.