Begin typing your search above and press return to search.

బాహుబలి తర్వాత రానా సినిమాను కూడా

By:  Tupaki Desk   |   20 Sep 2016 4:09 AM GMT
బాహుబలి తర్వాత రానా సినిమాను కూడా
X
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్ విడుదల కాకముందు.. ఆ చిత్రం బడ్జెట్-రిజల్ట్ వేరియేషన్ పై చాలామందికి అనుమానాలు ఉన్నాయి. తెలుగు వరకూ ఎలాంటి డౌట్స్ లేకపోయినా.. హిందీ వెర్షన్ పై సందేహాలు ఎక్కువే. అలాంటి టైమ్ లో ఏకంగా 25 కోట్లు ముట్టచెప్పి రైట్స్ దక్కించుకుని.. కరణ్ జోహార్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. పబ్లిసిటీ కోసం మరో 5 కోట్లు ఖర్చు చేసి.. మొత్తం మీద నాలుగు రెట్లు లాభాలు అందుకున్నాడు. ఇప్పుడీ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ మరో తెలుగు సినిమాను రిలీజ్ చేయనున్నాడు.

రానా దగ్గుబాటి నటించిన ఘాజీ మూవీని హిందీలో రిలీజ్ చేసేందుకు కరణ్ జోహార్ ఒప్పందం చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో తాప్సీ పాక్ శరణార్దిగా కనిపిస్తోంది. 1971లో మునిగిపోయిన పాకిస్తానీ సబ్ మెరైన్ ఆధారంగా ఈ మూవీ స్టోరీ ఉండనుండగా.. పీవీపీ సంస్థ ఘాజీని గ్రాండ్ గానే తెరకెక్కిస్తోంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ హైలైట్ గా నిలవనున్నాయి. ఇక ఘాజీ హిందీ వెర్షన్ కోసం భారీ మొత్తాన్ని చెల్లించాడట కరణ్ జోహార్. రానా.. తాప్సీలకు నార్త్ లో మంచి క్రేజ్ ఉండడం.. దేశంలో సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో వస్తున్న తొలి సినిమా కావడంతో.. ఆడియన్స్ ఈ డిఫరెంట్ జోనర్ కు బ్రహ్మరథం పడతారన్నది కరణ్ జోహార్ ఉద్దేశ్యం. బాహుబలి తర్వాత మళ్లీ ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఓ మల్టీ లింగ్యువల్ సినిమా రైట్స్ ను దక్కించుకోవడం.. ఆసక్తి కలిగిస్తోంది.

మామూలుగా కరణ్‌ చేయి పడిందంటే చాలు.. ఆ సినిమాకు ఆటోమ్యాటిక్ గా హిట్ టాక్ వచ్చేస్తుంది. అటువంటిది ఇప్పుడు బాహుబలి 2 తరువాత ఆయన ఈ సౌత్ సినిమాను తెస్తున్నాడంటే.. ఆ రేంజే వేరు మరి. చూద్దాం ఈ ఛాన్స్ రానా ఫ్యూచర్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.