Begin typing your search above and press return to search.
సెక్స్ కోసం రెండు సార్లు డబ్బులిచ్చాడు
By: Tupaki Desk | 17 Jan 2017 7:38 AM GMTబాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ రాసిన ఆటో బయోగ్రఫీ బోలెడన్ని ఆసక్తికరమైన విశేషాలను బయటపెడుతోంది. మిగిలిన వారిపై కంటే.. తన గురించే తాను నిజాలు రాసుకున్న ఈ దర్శక నిర్మాత.. సెక్స్ విషయంలో తన అనుభవాలకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నాడు.
కరణ్ జోహార్ కు 26 ఏళ్ల వయసు ఉన్నపుడు తొలిసారిగా సెక్స్ అనుభవం కోసం ప్రయత్నించాడట. న్యూయార్క్ లో ఉన్నపుడు సెక్స్ కోసం డబ్బులు చెల్లించి మరీ ప్రయత్నించాడట. అయితే.. తొలిసారి ప్రయత్నంలో ఘోరంగా విఫలం చెందాడట కరణ్ జోహార్. ఆ తర్వాత రెండో ప్రయత్నం చేస్తే.. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయిందట. దీంతో తెగ గిల్టీగా ఫీల్ అయిపోయిన కరణ్ జోహార్.. పెయిడ్ సెక్స్ అనేది కృత్రిమం అని.. అందులో ఎలాంటి ఫీలింగ్స్ కలగవనే విషయాన్ని తెలుసుకున్నానని రాసుకొచ్చాడు.
అలాగని తానేమీ సెక్స్ మేనియాక్ ని కాదని.. సెక్స్ ను తాను అంతగా పట్టించుకోనన్న కరణ్.. ప్రపంచమంతా ప్రయాణాలు చేసేవారు సెక్స్ కోసం ఉబలాటపడిపోతారని అనుకోవడం కరెక్ట్ కాదని అన్నాడు. ప్రస్తుతం తాను ఎవరినీ ప్రేమించడం లేదని.. అలాగే ఇకపై కూడా ప్రేమించాలని అనుకోవడం లేదని చెప్పాడు కరణ్ జోహార్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/