Begin typing your search above and press return to search.
కరణ్ జోహర్ కు పోయేదేమీ లేదా?
By: Tupaki Desk | 28 Aug 2022 2:30 AM GMTభారీ అంచనాల మధ్య విడుదలైన మూవీ `లైగర్`. విజయ్ దేవరకొండ దాదాపు మూడేళ్లు ఈ మూవీ కోసం కఠోరంగా శ్రమించాడు. ఆ శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, అపూర్వ మోహతా, హీరూ జోహార్, పూరి, ఛార్మి కలిసి ఈ మూవీని తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో నిర్మించారు. తెలుగు, హిందీతో పాటు ఈ మూవీని ఆగస్టు 25న భారీ స్థాయిలో తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేశారు.
అయితే రిలీజ్ కు ముందు భారీ హైప్ క్రియేట్ కావడంతో సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ ని రాబడుతుందని అంతా ఊహించారు.
అదే స్థాయిలో నెట్టింట ప్రచారం కూడా జరిగింది. అయితే రిలీజ్ తరువాత ఫస్ట్ డే ఫస్ట్ షో కు ఫ్లాప్ టాక్ బయటికి రావడంతో సినిమాపై తీవ్ర ప్రభావం మొదలైంది. దీనికి పూర్తిగా దర్శకుడు పూరి జగన్నాథ్ వైఫల్యం కావడమేననే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
వెర్సటైల్ డైరెక్టర్ గా, హీరో క్యారెక్టర్ పై సినిమాని నడిపించగల స్క్రీన్ ప్లే మాస్టర్ గా పేరున్న పూరి జగన్నాథ్ ఈ సినిమా విషయంలో తన మ్యాజిక్ ని సరిగా వుపయోగించలేకపోవడం, కథ, కథనాల్లో లోపాలు వుండటంతో ఈ మూవీ ఆగస్టు 25న భారీ స్థాయిలో విడుదలై ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. తాజాగా అందుతున్న ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ ప్రకారం రూ. 20 కోట్ల మేర నష్టాలని అందించడం ఖాయం అని తెలుస్తోంది.
అయితే ఈ మూవీని హిందీలో కరణ్ జోహార్ విడుదల చేశారు. ఆయన డబ్బులు ఖర్చు చేశారు కాబట్టి ఆయనకే రూ. 20 కోట్ల మేర నష్టాలు వచ్చే అవకాశం వుందన్నది ఇండస్ట్రీ వర్గాల వాదన. కానీ ఆయనకు పూరి సినిమాని ఫ్రీగా ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్రీగా ఇస్తే కరణ్ జోహార్ కు పోయేదేముంది. లైగర్ వల్ల నష్టాపోయేది పూరీనే అంటున్నారు.
ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. సినిమా ఫలితం తారు మారు కావడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ స్థాయిలో నష్టపోయే ప్రమాదం వుందని, ఆ పరంగా పూరి రూ. 20 కోట్లు తిరిగి ఇచ్చే పరిస్థితులు తలెత్తనున్నాయని అంటున్నారు.