Begin typing your search above and press return to search.

జీరో పెట్టుబడితో దోచుకుందామనే!!

By:  Tupaki Desk   |   5 Jun 2017 11:56 AM GMT
జీరో పెట్టుబడితో దోచుకుందామనే!!
X
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అంటేనే ఓ బ్రాండ్. ధర్మ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ కు ఉన్న వాల్యూతోనే బోలెడంత సంపాదించేయగలడు. ఇప్పటికే ఈ విషయం పలుమార్లు ప్రూవ్ అయింది కూడా. బాలీవుడ్ సినిమాలను బాగానే మార్కెట్ చేసుకున్న కరణ్ జోహార్.. ఇప్పుటు టాలీవుడ్ పై బాగానే కన్నేశాడు. జీరో పెట్టుబడితో ఈ కంటెంట్ తో దోచుకుందామని డిసైడయ్యాడు.

బాహుబలి ది బిగినింగ్ తర్వాత బాహుబలి ది కంక్లూజన్ సాధించిన ఘన విజయం ఈ దర్శకుడిలో జోష్ పెంచింది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులను అక్కడ నేరుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు స్పైడర్ మూవీ విషయంలో ఓ అగ్రిమెంట్ కు వచ్చేశాడని తెలుస్తోంది. ఎలాగూ తెలుగు స్టార్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందుతాయి. విజువల్ రిచ్ గా ఉండడంతో పాటు మేకింగ్ వాల్యూస్ ఉంటాయి. వీటిని నామమాత్రమే ఖర్చులతో బాలీవుడ్ లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసేయచ్చు.

ఇప్పటివరకూ అక్కడ మార్కెట్ లేదు కాబట్టి.. పెద్దగా ధర కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒక వేళ సక్సెస్ అయితే మాత్రం భారీ మొత్తంలో లాభాలకు ఛాన్స్ ఉంటుంది. ఫెయిల్ అయినా పెద్ద నష్టమేమీ ఉండదు. దాదాపు జీరో పెట్టుబడిపెట్టేసి.. తన ఇమేజ్ ను వాడుకుని.. ఫుల్లుగా లాభాలు అందుకునే వ్యాపారం అనమాట. అందుకే సెట్స్ పై ఉన్న పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలతో తెగ డిస్కషన్స్ చేసేస్తున్నాడట కరణ్ జోహార్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/