Begin typing your search above and press return to search.
ఆర్యన్ ఖాన్ కేసుతోపాటు బాలీవుడ్ లో మరో సంచలనం
By: Tupaki Desk | 22 Oct 2021 4:46 AM GMTఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంతో కంపు అయిన బాలీవుడ్ కు ఇప్పుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తో షేక్ అయ్యింది. ఇప్పుడు ఈ కేసులో అనన్య పాండే సహా ఇద్దరు ముగ్గురిని విచారించడంతో బాలీవుడ్ లో ఆందోళన నెలకొంది.
డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఆర్యన్ ఖాన్ తర్వాత ఎన్సీబీ టార్గెట్ ఎవరనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఖచ్చితంగా ఎన్సీబీ నెక్ట్స్ టార్గెట్ ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహర్ అని ప్రచారం సాగుతోంది. రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఎన్సీబీ దర్యాప్తు ఇప్పటికీ పూర్తికాలేదు. ఆ పార్టీలో పాల్గొన్న అందరిపై ఎన్సీబీ నిఘా ఉంచినట్లు సమాచారం.
ఇప్పటికే అనేకమంది బాలీవుడ్ సెలబ్రెటీలను అరెస్ట్ చేసిన ఎన్సీబీ రీజనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే పదవిని మరో ఆరు నెలల కేంద్ర ప్రభుత్వం పొడిగించడం విశేషం. గత 6 నెలలుగా అనేక మంది బాలీవుడ్ సెలబ్రెటీలపై ఎన్సీబీ అధికారులు నిఘా ఉంచినట్టు తెలుస్తోంది. కరణ్ జోహర్ నివాసంలో జరిగిన పార్టీపై ఇప్పటికే దర్యాప్తు సాగుతోందని ఒక అధికారి తెలిపారు. ఈ పార్టీకి బాలీవుడ్ హీరోలు రణ్ బీర్ కపూర్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్, మలైక అరోరా, దీపికా పడుకొణే, అర్జున్ కపూర్ , షాహిద్ కపూర్, అయాన్ ముఖర్జీ హాజరయ్యారు.
ఈ వీడియోను కరణ్ జోహర్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పార్టీలో బాలీవుడ్ సెలబ్రెటీలంతా డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఎటువంటి సాక్ష్యాలు ఈ వీడియోలో లభించలేదని దర్యాప్తులో తేలిందట..సుశాంత్ సింగ్ కేసులో ఎన్సీబీ ఈ వీడియోపై దర్యాప్తు కూడా చేసింది.
తనకు పొడిగించిన 6 నెలల పదవీకాలంలో ఏ బాలీవుడ్ సెలబ్రెటీని సమీర్ వాంఖడే వదిలిపెట్టబోడని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సుశాంత్ సింగ్ మృతి డ్రగ్స్కేసు దర్యాప్తు పూర్తికాలేదు. ఈ దర్యాప్తు కొనసాగుతుండగానే సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. ఆ పార్టీలో ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదని కరణ్ జోహర్ చెప్పడం విశేషం. కానీ ఇందులో పాల్గొన్న వారిపై ఎన్సీబీ నిఘా ఉంచింది.
సుశాంత్, రియా చక్రవర్తి, ఆర్మాన్ కోహ్లి, ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులకు లింక్ ఉందని ఎన్సీబీ విచారణలో తేలింది. ఈ క్రమంలోనేబ లమైన ఆధారాలు తీసుకొని బాలీవుడ్ సినీ ప్రముఖులకు చెక్ పెట్టాలని ఎన్సీబీ యోచిస్తోందట.. అందులో కరణ్ జోహర్ కూడా ఉండొచ్చని అంటున్నారు. గతంలోనూ శ్రద్ధకపూర్, సారా అలీఖాన్, దీపికా పడుకొనేతో ఎన్సీబీ అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కరణ్ జోహర్ అరెస్ట్ అయితే మాత్రం మరింత దుమారం రేగడం ఖాయం.