Begin typing your search above and press return to search.

మీడియాను ఆడుకుంటున్న కరణ్‌

By:  Tupaki Desk   |   22 July 2016 11:43 AM GMT
మీడియాను ఆడుకుంటున్న కరణ్‌
X
ఎన్డీ టివి కోసం రాస్తున్న సిరీస్ ఆఫ్‌ ఆర్టికల్సులో తనకు నచ్చిన టాపిక్స్ టచ్ చేస్తూ మీడియాను చీల్చి చెండాడేస్తున్నాడు ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌. కొత్తగా రాసిన ఒక వ్యాసంలో మనోడు మీడియా వారు అడిగే ప్రశ్నల వెనుకున్న అసలైన అర్ధం ఏంటో.. తాను కూడా మనస్సులో ఆ ప్రశ్నకు ఏమి ఆన్సర్ థింక్‌ చివరకు పైకి ఏం చెబుతాడో.. వగైరా విషయాలన్నీ చెప్పాడు.

మీడియా వారు నన్నుచాలాసార్లు ఏమని అడుగుతారంటే.. ''మీరు డైరక్షన్ తో ప్రూవ్ చేసుకున్నారు కదా.. మళ్లీ కాఫీ షోలు.. రియాల్టీ షో లో జడ్జిగా వేషాలు.. ఎందుకు?'' అంటారు. దానికి నేను ఏమంటానంటే.. ''బహుశా ఫిలిం మేకర్ ను కదండీ.. మల్టీ టాస్కింగ్ అలవాటు అయిపోయింది. అందుకే చేస్తున్నా'' అని చెబుతా. కాని నిజానికి నా మనస్సులో ఏముంటుందటే.. ''వాళ్లు రియాల్టీ షో జడ్జిగా వెళితే డబ్బులిస్తారు. ఆ డబ్బు లేకపోతే రోజూ జల్సాలు చేసుకోవడం.. డిజైనర్ బట్టలు కొనుక్కోవడం ఎలా కుదురుతుంది? ఎందకు ఈ చచ్చు ప్రశ్నలు'' అని సమాధానం చెప్పాలని అనిపిస్తుంటుంది.. అంటూ రకరకాలు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు కరణ్‌ జోహార్‌.

అంతే కాకుండా చాలామంది మనోడ్ని ''మీ సెక్సువాలిటీ గురించి చాలా కథలుకథలుగా వింటున్నాం. దాని గురించి ఏమన్నా చెబుతారా?'' అని అడుగుతారట. కాని వారి నిజమైన ప్రశ్న ఏమైయుంటుంది అంటే.. ''నువ్వు గే కదూ? చెప్పేయ్ చెప్పేయ్'' అని వాళ్ళ మనస్సులో ఉంటుందట. అలాంటి జర్నలిస్టులు దొరికినప్పుడు ఇలాంటి ప్రశ్నలను తప్పించుకోవడంలోనే మన తెలివంతా చూపాలి అంటున్నాడు.