Begin typing your search above and press return to search.
ఆమె కావాలని నన్ను ఎవరు అడగలేదు
By: Tupaki Desk | 27 Jan 2019 1:30 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కు ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు మద్య వివాదం చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కొన్నాళ్ల క్రితం కరణ్ జోహార్ కు బంధు ప్రీతి ఎక్కువని - అందుకే తన సన్నిహితులకు మాత్రమే తన సినిమాల్లో ఛాన్స్ ఇస్తూ ఉంటాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన దర్శకత్వంలో - ఆయన బ్యానర్ లో చేయాలనే కోరిక కాని - ఆసక్తి కాని నాకు లేదు అంటూ కంగనా వ్యాఖ్యలు చేసింది. కంగనా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం దాటింది. అయినా ఇప్పటి వరకు కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కాని - నిర్మించిన సినిమాలో కాని ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు.
తాజాగా ఆ విషయమై కరణ్ జోహార్ మాట్లాడుతూ.. నేను తెరకెక్కించిన ఏ సినిమాలో కూడా హీరోయిన్ పాత్రకు కంగనా సెట్ అవుతుందనిపించలేదు. అందుకే ఆమెను తీసుకోలేదు. హీరోయిన్ గా తన సినిమాలో కంగనా కావాలని ఏ ఒక్క దర్శకుడు కూడా అడగలేదు. అందుకే ఆమెను తాను నిర్మించిన సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోలేదు. నా సినిమాలో నటించిన ఏ హీరో కూడా కంగనా హీరోయిన్ గా కావాలని అడగలేదని, అందుకే ఆమెతో తాను ఇప్పటి వరకు కలిసి వర్క్ చేయాలేదని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.
కంగనాతో నాకు ఎలాంటి గొడవ లేదు, ఆమెతో నేను సినిమా చేసేందుకు చూస్తున్నాను. నేను చేసే సినిమాకు కంగనా అవసరం ఉందనుకుంటే తప్పకుండా ఆమెను తీసుకుంటాను. ఇప్పటి వరకు అలాంటి సినిమా చేయలేదు - అందుకు నేనేం చేయాలి చెప్పండి. తనకు ఎవరితో వివాదం ఉండదని - తన సినిమాకు ఎవరి అవసరం ఉంటే వారిని తీసుకుంటాను. నాకు అనురాగ్ కశ్యప్ కు చిన్న చిన్న విభేదాలున్నాయి. అయినా కూడా నేను నిర్మించిన 'కుర్బాన్' చిత్రానికి ఆయన అవసరం ఉండటంతో తీసుకుని డైలాగ్స్ రాయించాను. అలాగే తన సినిమాకు కంగనా అవసరం ఉంటే తప్పకుండా ఆమెను తీసుకుంటాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.