Begin typing your search above and press return to search.

సౌత్‌ సినిమాల గురించి కరణ్‌ మనసులో మాట!

By:  Tupaki Desk   |   26 Nov 2018 1:30 AM GMT
సౌత్‌ సినిమాల గురించి కరణ్‌ మనసులో మాట!
X
ఒప్పుడు సౌత్‌ సినిమాలకు, బాలీవుడ్‌ సినిమాలకు బడ్జెట్‌ పరంగా, బిజినెస్‌ పరంగా, కలెక్షన్స్‌ పరంగా ఇలా అన్ని విషయాల్లో కూడా చాలా వ్యత్యాసం ఉండేది. బాలీవుడ్‌ సినిమాల స్థాయికి ఏమాత్రం తెలుగు సినిమాలు చేరుకోలేక పోయేవి. బాలీవుడ్‌ సినిమాల బడ్జెట్‌ లో కనీసం సంగం కూడా సౌత్‌ సినిమా బడ్జెట్‌ ఉండేవి కాదు. కాని ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నం. బాలీవుడ్‌ లో ఈమద్య వచ్చిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ చిత్రం 300 కోట్లతో తెరకెక్కింది. బాలీవుడ్‌ లో అదే రికార్డుగా చెప్పుకుంటున్నారు. కాని సౌత్‌ లో ఈమద్య వరుసగా వందల కోట్ల బడ్జెట్‌ సినిమాలు రూపొందుతూనే ఉన్నాయి.

తాజాగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 2.ఓ చిత్రంకు ఏకంగా 600 కోట్లను ఖర్చు చేశారనే విషయం తెల్సిందే. ఇక బాహుబలి, సాహో, సైరా వంటి సినిమాలు కూడా భారీ బడ్జెట్‌ తో రూపొందాయి, రూపొందుతున్నాయి. అందుకే బాలీవుడ్‌ కంటే సౌత్‌ సినీ ఇండస్ట్రీ ముందుందని చెప్పుకోవాలి. తాజాగా ఈ విషయాన్ని బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్‌, స్టార్స్‌ మేకర్‌ గా పేరున్న కరణ్‌ జోహార్‌ కూడా ఒప్పుకున్నాడు.

బడ్జెట్‌ విషయంలో, టెక్నాలజీ విషయంలో ఇతర విషయాల్లో సౌత్‌ సినిమాలు బాలీవుడ్‌ సినిమాల కంటే కూడా ముందు ఉంటున్నాయని కరణ్‌ తాజాగా చెప్పుకొచ్చాడు. రజినీ, శంకర్‌ ల కాంబినేషన్‌ లో రూపొందిన ‘2.ఓ’ చిత్రాన్ని హిందీలో డబ్‌ చేసి కరణ్‌ అక్కడ తన ధర్మ ప్రొడక్షన్స్‌ ద్వారా విడుదల చేస్తున్నాడు. తాజాగా చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా సౌత్‌ సినిమాలపై తన మనసులో మాట చెప్పాడు. ఈ మాట బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ కు కాస్త కఠువుగా ఉన్నా ఇది నిజం అంటూ బాలీవుడ్‌ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి.