Begin typing your search above and press return to search.
టాక్ ఆఫ్ ది టౌన్! ఇంతకీ సౌత్ ని పొగిడాడా తిట్టాడా?
By: Tupaki Desk | 11 Dec 2022 2:30 AM GMT2022 బాలీవుడ్ కి పీడకలను మిగిల్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన అగ్రహీరోల సినిమాలు ఒకదాని వెంట ఒకటిగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లు గా నిలిచాయి. కాశ్మీర్ ఫైల్స్- భూల్ భులయా 2- బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలు విజయాలు సాధించి ఉండకపోతే బాలీవుడ్ శూన్య దశకు చేరుకుని మరింతగా విమర్శల పాలయ్యేది. ఖాన్ లు ఖిలాడీలు కపూర్ లు ఇటీవల ఆదుకునే సన్నివేశం కనుమరుగైంది. ఇది ఊహించని సన్నివేశం. దీంతో బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు పండితులు సైతం డీలా పడిపోయారు. ప్రతిష్ఠాత్మక యష్ రాజ్ ఫిలింస్ సైతం భారీ సినిమాలతో చేతులు కాల్చుకోవడం ఈ ఏడాది ఊహకందనిది.
బాక్సాఫీస్ వద్ద పెద్ద సంఖ్యలో భారీ సినిమాలు ఆడకపోవడంతో తీవ్ర నిరాశే ఎదురైంది. బాలీవుడ్ కి 2022 బ్యాడ్ ఇయర్. అయితే దీని నుంచి కంబ్యాక్ అవ్వడమెలా? అన్నదానిపై జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ట్రేడ్ లో కీలకమైన దర్శకనిర్మాతగా కరణ్ జోహార్ చేసిన విశ్లేషణ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇటీవ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చిత్రనిర్మాత .. నిర్మాత కరణ్ జోహార్ ప్రధాన స్రవంతి బాలీవుడ్ దశాబ్దాలుగా ఎక్కడికి వెళ్లింది? అనే దానిపై తన అభిప్రాయాలను షేర్ చేసారు.
బాలీవుడ్ ఎక్కడ తప్పు చేసిందని కరణ్ జోహార్ కి ఈ సమావేశంలో ప్రశ్న ఎదురు కాగా అతడు తన అభిప్రాయం చెప్పారు. ``మేము సలీం-జావేద్ బ్రాండ్ సినిమాని వదిలి స్విట్జర్లాండ్ కు వెళ్లాం`` అని ఆయన వ్యాఖ్యానించారు. కరణ్ అభిప్రాయం ప్రకారం... ``ప్రముఖ రచయిత ద్వయం సలీం-జావేద్ (సలీం ఖాన్ - జావేద్ అక్తర్) 1970లలో మరపురాని చిత్రాలను అందించారు. అయితే మేము వాటిని మరింతగా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాం. సలీం సాబ్ .. జావేద్ సాబ్ లకు చాలా కృతజ్ఞతలు చెప్పాల్సిన మేము ఆ స్థాయిని విడిచిపెట్టి స్విట్జర్లాండ్ వెళ్ళాం`` అని చెప్పాడు.
కరణ్ 1990లలో రొమాంటిక్ చిత్రాల హవా సాగిందని అన్నారు. ఈ సినిమాల్లో తానూ ఒక భాగమే. `హమ్ ఆప్కే హై కౌన్` తర్వాత నాతో సహా అందరూ ప్రేమ కథల్లోకి దూకాలని నిర్ణయించుకున్నాం. ఆ సమయంలోనే షారూఖ్ ఖాన్ సృష్టించబడ్డాడు!! అని కరణ్ వ్యాఖ్యానించారు. మేం 70ల నుండి మా మూలాలన్నింటినీ వదిలేసాం. 2001లో `లగాన్` అకాడమీ అవార్డుకు నామినేట్ అయినప్పుడు మేం 2010ల వరకు అలాంటి చిత్రాలను చేస్తామనే భావించాం. `దబాంగ్` తో పాటు విడుదలైన `మై నేమ్ ఈజ్ ఖాన్` నిజానికి `లగాన్` రూట్ లో ఉంది. కానీ ఇటీవల ధోరణి మారింది. ప్రజలు ఇప్పుడు మళ్లీ కమర్షియల్ సినిమాలు చూడటం ప్రారంభించారు`` అని అన్నారు. అదే అసలు సమస్య.. మనకు వెన్నెముక (కమర్షియల్ సినిమా ధోరణి) లేదు..వీటిపై నమ్మకం లేదు.. అని కూడా అంగీకరించారు కరణ్.
బాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్లలో ఎక్కువ భాగం ముంబై - ఢిల్లీ నుండి వస్తుందని కరణ్ చెప్పాడు. అయితే మహమ్మారి తర్వాత ఈ రెండు మెట్రోల ప్రేక్షకులు స్థిరంగా థియేటర్ లను సందర్శించడం లేదు. కాబట్టి డబ్బింగ్ చిత్రాలే అయినా కానీ.. బాక్సాఫీస్ వద్ద వర్కవుటవుతుననవి ``కళ్లజోడు(స్పెక్టకిల్) చిత్రాలు మాత్రమే`` అన్నారాయన. అయితే కరణ్ జోహార్ తప్పు ఒప్పుల విశ్లేషణ అంతా బాగానే చేశారు కానీ... చివరిలో అతడు కళ్లజోడు సినిమాలు లేదా అద్భుత చిత్రాలు అంటూ సౌత్ సినిమాలను అవహేళన చేసాడా? అన్న సందేహం కలగక మానదు.
అయితే సౌత్ నుంచి వచ్చిన ఆర్.ఆర్.ఆర్ కానీ కేజీఎఫ్ 2 కానీ రెగ్యులర్ మూస కథలతో వచ్చినవి కానే కావు. ఆ సినిమాల స్థాయిలో బాలీవుడ్ లో వేరొక సినిమా లేనే లేదు. కానీ కరణ్ లో కొంత వ్యంగ్యం ధ్వనించిందని ఇప్పుడు అంతా గుర్తించారు. ఒకవేళ సౌత్ సినిమా కళ్లజోడు సినిమా అయితే డిజాస్టర్లతో అల్లాడిపోయిన ``బాలీవుడ్ కళ్లు ఉన్న గుడ్డి సినిమా``గా డిక్లేర్ చేయాలని సోషల్ మీడియాల్లో కౌంటర్లు పడిపోతున్నాయి. స్పెక్టాకిల్ అంటూ అతడు పొగిడాడా లేక తెగిడాడా? అన్నది అర్థం కాలేదు. అయితే విజువల్ గా గొప్ప కమర్షియల్ ఎలిమెంట్స్ తో తీసిన సినిమాలే ఆడుతున్నాయని గొప్ప ఐడియాలజీతో ఉన్నా కానీ బాలీవుడ్ సినిమాలు ఆడడం లేదనే అర్థంలో కరణ్ విశ్లేషణ సాగింది. నిజానికి దేశంలో మెజారిటీ పార్ట్ గా ఉన్న మాస్ ని థియేటర్లకు లాగడం అనే సౌత్ సినిమా ఫార్ములాని ఇప్పటికీ కరణ్ కానీ బాలీవుడ్ కానీ అర్థం చేసుకున్నట్టు కనిపించడం లేదు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కరణ్ వచ్చే ఏడాది` రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` ద్వారా దర్శకుడిగా కంబ్యాక్ కాబోతున్నాడు. ఈ చిత్రం 28 ఏప్రిల్ 2023న విడుదల కానుంది. ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్- అలియా భట్- ధర్మేంద్ర- జయా బచ్చన్ తారాగణం. షబానా అజ్మీ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.