Begin typing your search above and press return to search.
‘సెక్స్’ గురించి కరణ్ ఓపెన్ గా మాట్లాడితే..
By: Tupaki Desk | 9 Jan 2017 10:26 AM GMTబాలీవుడ్ దిగ్గజ దర్శక.. నిర్మాతగా సుపరిచితుడు.. నటుడిగా.. మంచి ప్రజంటర్ గా పేరున్న కరణ్ జోహార్ లో మరోకోణం కూడా ఉంది. ఆయన మాటల్లో.. చేష్టల్లో వివాదాలు కలగలిపి ఉంటాయి. ఆయనకు.. బాలీవుడ్ బాద్షా గురించి కొందరు చేసే చిత్రమైన వ్యాఖ్యలపై అగ్గి ఫైర్ అయ్యే కరణ్ జోహార్ సెక్సువల్ లైప్ గురించి బాలీవుడ్ లో పలు రూమర్లు వినిపిస్తుంటాయి.
అలాంటి కరణ్.. తనకు తానే ఓపెన్ గా సెక్స్ గురించి మాట్లాడితే అంతకు మించిన సంచలనం ఇంకేం ఉంటుంది. తాజాగా.. తన సెక్స్ జీవితం గురించి.. తన సెక్స్ దృక్ఫధం గురించి కాస్తంత ఓపెన్ గా విప్పి చెప్పారు. ఇంతకీ ఎప్పుడు చెప్పారు? ఎక్కడ చెప్పారు? ఏ సందర్భంలో చెప్పారన్న ప్రశ్నలకు సమాధానం చెబితే.. ఆయన తన ఆత్మకథను.. ‘‘ద అన్ సూటబుల్ బాయ్’’ పేరుతో ఒక పుస్తకం రాస్తున్నారు.
అందులో ఆయన చాలానే విషయాలు వెల్లడించినట్లుగా చెబుతున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ పుస్తకానికి సంబంధించి.. కరణ్ సెక్స్ గురించి ప్రస్తావించిన అంశాల గురించి చెబుతూ.. ‘‘సెక్స్ గురించి నిర్మోహమాటంగా మాట్లాడితే జైల్లో పెట్టే దేశంలో ఉన్నాను. అందుకే ఆ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడను. సెక్స్ అనేది పూర్తిగా వ్యక్తిగతమైనది. నా సెక్స్ జీవితం గురించి రకరకాల పుకార్లు వినిపిస్తుంటాయి. ఓ హిందీ చానల్ లో నన్ను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నా గురించి.. షారూక్ గురించి మాట్లాడుతూ.. మీ ఇద్దరిని అనూహ్యమైన బంధమని వ్యాఖ్యానించారు. దీనికి చాలా కోపం వచ్చింది. ఆ వెంటనే నేను స్పందించి నువ్వు నీ సోదరుడిగా పడుకుంటున్నావు అని నేను అంటే నీకు ఎలా ఉంటుందని ప్రశ్నించా. దానికి సదరు రిపోర్టర్ స్పందిస్తూ.. మీరు నన్ను అలాంటి ప్రశ్న ఎలా అడుగుతారు? అని ప్రశ్నించారు.అలాంటప్పుడు మీరు నన్ను అలాంటి ప్రశ్న అడుగుతారని ప్రశ్నించా. షారూక్ నాకు తండ్రితో సమానం. ఆయన నా సోదరుడు’’ అని చెప్పినట్లుగా వెల్లడించారని చెబుతున్నారు.
తన గురించి.. షారూక్ గురించి వచ్చే పుకార్లను ఆయన అస్సలు పట్టించుకోరని.. జనం నోటికి ఏది వస్తే దాన్ని మాట్లాడతారని.. వివాహేతర సంబంధాలు లేకుంటే.. స్వలింగ సంపర్కుడిగా ముద్ర వేస్తారు’’ అని అన్నారు.
తన సెక్స్ జీవితం గురించి చాలామంది జోక్ గా మాట్లాడతారని.. తాను హోమో సెక్సువాలిటీకి పోస్టర్ బాయ్ గా మారినట్లుగా అభివర్ణించారు. సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడమని చాలామంది చెబుతుంటారని.. కానీతనకు చాలా బాధ్యతలు ఉన్నాయని.. చాలామందికి తాను జవాబుదారినని వ్యాఖ్యానించారు. సెక్స్ గురించి మాట్లాడి అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవాలంటూ చెప్పినట్లే చెప్పి తప్పించుకున్నారని చెప్పక తప్పదు.