Begin typing your search above and press return to search.

ముగ్గురు భామల‌ మ‌ధ్య‌లో మ‌న్మ‌ధుడు!

By:  Tupaki Desk   |   24 Oct 2022 1:30 PM GMT
ముగ్గురు భామల‌ మ‌ధ్య‌లో మ‌న్మ‌ధుడు!
X
బాలీవుడ్ ద‌ర్శ‌క‌-నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ర్యాపో గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కొన్నేళ్ల‌గా ఆయ‌న బాలీవుడ్ కి త‌న సేవ‌లు అందిస్తున్నాడు. సీనియ‌ర్ భామ‌ల నుంచి జూనియ‌ర్ భామ‌ల వర‌కూ ఎవ‌రిపైనైనా? ఇట్టే జోక్ వేయ‌గ‌ల‌డు. అలాగే స‌మ‌ర్ధించుకోగ‌ల‌డు. ఈ లాజిక్ లు బాలీవుడ్ లో ఆయ‌న ద‌గ్గ‌ర త‌ప్ప ఇంకెవ‌రి ద‌గ్గ‌ర క‌నిపించ‌వు.

త‌న‌లో ఆ క్వాలిటీనే మిగతా వారి నుంచి క‌రణ్ ని వేరు చూస్తుంది. బాలీవుడ్ లో వ్య‌క్తిగ‌తంగా అంత‌గా ఫేమ‌స్ అయ్యాడంటే? ఇంకా చాలా సంగ‌తులే ఉన్నాయి. అవన్నీ ప‌క్క‌న‌బెడితే తాజాగా క‌ర‌ణ్ కెమెరాకి ఇచ్చిన ఫోజు చూస్తూ స్ట‌న్ అవ్వాల్సిందే.

న‌వ భామ‌ల మ‌ధ్య‌లో ర‌సిక రాజాలా ఇదిగో ఇక్క‌డిలా నలిగిపోతున్నాడు. జాన్వీ వెనుక క‌ర‌ణ్ ఆయ‌న వెనుక సారా అలీఖాన్..ఆమె వెనుక అన‌న్య పాండే ఇలా అందంగా ముస్తాబై ఫోజులిచ్చారు.

దీపావ‌ళి సంద‌ర్భంగా చోటు చేసుకున్న స‌న్నివేశం ఇది. జాన్వీ...అన‌న్య‌ పాండేలు అంద‌మైన చీర‌లు ధ‌రిస్తే....లెహంగాలో సారా మిరుమిట్లు గొలుపుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. కర‌ణ్ ని ఇలా చూసి అభిమానులు ఎవ‌రి స్టైల్లో వారు కామెంట్లు పెడుతున్నారు. ముగ్గురు భామ‌ల మ‌ధ్య న‌వ మ‌న్మ‌ధుడు అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇదే మూవ్ మెంట్లో ముగ్గుర్ని ఒకేసారి త‌న టాక్ షోకి పిలిచి క‌ర‌ణ్ త‌న‌దైన శైలిలో ఇంట‌ర్వ్యూ చూస్తే ఆకిక్కే వేరుగా ఉంటుంది. పోష్ గాళ్స్ కాబట్టి స‌మాధానాలు కూడా అంతే పోష్ గా ఉంటాయి. ఇషాన్ క‌ట్టర్- జాన్వీ-సారాల ఎఫైర్ సంగ‌తులు బయ‌ట‌కు వ‌స్తాయి.

ఇక వృత్తి ప‌రంగా ముగ్గురు బిజీగానే ఉన్నారు. జాన్వీ సౌత్ ఎంట్రీ ప్ర‌య‌త్నాలు కూడా మొద‌లు పెట్టింది. ఎంట్రీ ఎప్పుడైనా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తోంది. అలాగే క్లోజ్ ప్రెండ్ సారా అలీఖాన్ సైతం ఎంట్రీ ఇచ్చినా ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌రం లేదు. ఇక అన‌న్య పాండే ఇప్ప‌టికే లైగ‌ర్ లో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.