Begin typing your search above and press return to search.
కరణ్ జోహర్ రెడీ గా ఉన్నాడట!
By: Tupaki Desk | 15 Nov 2018 2:14 AM GMTసాధారణంగా ఏదైనా సినిమా రైట్స్ కొనేందుకు ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపిస్తే సినిమా హాట్ కేక్ లా ఉంది అంటారు. #RRR పరిస్థితి అంతకు వెయ్యి రెట్లు ఉంది. సినిమాకు కొబ్బరికాయ కొట్టిన రోజునుండే ఈ సినిమా హక్కులను చేజిక్కించుకునేందుకు ఆసక్తి వ్యక్తం అవుతోందట. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఆల్రెడీ #RRR పై కన్నేశాడట.
SS రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు భాగాలనూ హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో ఉన్న సత్తాతో పాటుగా కరణ్ జోహార్ అసోసియేషన్ వల్లే నార్త్ ఇండియాలో అంత ఆదరణ దక్కిందని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. భారీ రిలీజ్ నెట్ వర్క్ తో పాటుగా బాలీవుడ్ మీడియాలో 'బాహుబలి' కి ఒక డైరెక్ట్ హిందీ సినిమాకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అంత కవరేజ్ ఇప్పించడంలో కరణ్ జోహార్ కీలక పాత్ర పోషించాడు. దానికి తగ్గట్టే లాభాలు.. హిందీ ఆడియన్స్ చేత ప్రశంసలు అందుకున్నాడు. దీంతో ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ రెప్యుటేషన్ కూడా మరింతగా పెరిగింది. అందుకే ఈసారి రాజమౌళి సినిమాను కూడా వదలదలుచుకోలేదట.
రాజమౌళి.. నిర్మాత దానయ్య తో ఇప్పటికే కరణ్ జోహార్ టచ్ లో ఉన్నాడని హిందీ వెర్షన్ #RRR కోసం కళ్ళుచెదిరే మొత్తాన్ని ఆఫర్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను వేరే బాలీవుడ్ నిర్మాత చేతికి పోకుండా ఇప్పటి నుండే కర్చీఫ్ వేసి పెడుతున్నాడన్నమాట. ఈ లెక్కన ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయినట్టే.. యంగ్ టైగర్.. మెగా పవర్ స్టార్లు కూడా ప్యాన్ ఇండియా స్టార్లు కావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టే.