Begin typing your search above and press return to search.
జక్కన్న మెడమీద కరణ్‌జోహార్ కత్తి
By: Tupaki Desk | 8 Jun 2015 11:30 AM GMTమే 15న బాహుబలి రిలీజ్ అన్న మాట గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు జులై 10 కూడా తరుముకొచ్చేస్తోంది. ఐతే మొన్నటిదాకా రాజమౌళి ఆ డేట్ కూడా ఖాయం అని చెప్పలేకపోయాడు. కానీ ముంబయికి వెళ్లి ట్రైలర్ లాంచ్ చేశాడో లేదో.. అప్పట్నుంచి జులై 10న రిలీజ్ ఖాయం అంటున్నాడు. చెన్నైకి వెళ్లి తమిళ ట్రైలర్ రిలీజ్ చేసి అక్కడ కూడా మరోసారి జులై 10న రిలీజ్ ఖాయమని చెప్పింది బాహుబలి టీమ్. ఐతే నిజానికి వారం కిందటి వరకైతే జులై 10 విషయంలో కూడా పట్టుదలగా ఏమీ లేదట రాజమౌళి అండ్ కో.
కానీ ముంబయికి వెళ్లినపుడు కరణ్ జోహార్ రిలీజ్ డేట్ వాయిదా ఆలోచనను గట్టిగా వ్యతిరేకించినట్లు సమాచారం. బాలీవుడ్‌లో ఇలా డేట్లు మార్చే సంప్రదాయం లేదని.. ఒక డేట్ అనుకున్నాక దాని ప్రకారం కచ్చితంగా సినిమా రిలీజ్ చేయాల్సిందేనని.. లేదంటే క్రెడిబిలిటీ దెబ్బతింటుందని చెప్పాడట. ఏం చేస్తారో చేయండి.. జులై 10న సినిమా రిలీజ్ చేయాల్సిందే అని హుకుం జారీ చేశాడట. దీంతో కిందా మీదా పడి అయినా సరే.. జులై 10నే సినిమా రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాడట రాజమౌళి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పనులు, తెలుగు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయినప్పటికీ.. తమిళ, హిందీ భాషల పనుల విషయంలోనూ కొంచెం లేటవుతుందేమో అన్న కంగారుంది బాహుబలి టీమ్‌లో. మరి మూడు భాషల్లో ఒకేసారి జులై 10న సినిమాను విడుదల చేయగలుగుతారా లేదా అన్నదే చూడాలి.