Begin typing your search above and press return to search.
అంతా అయ్యాక అయ్యో అంటే ఏం లాభం..?
By: Tupaki Desk | 24 Jan 2019 5:24 AM GMTబాలీవుడ్ స్టార్స్ మేకర్ గా కరణ్ జోహార్ కు పేరుంది. ఎంతో మందిని స్టార్స్ గా నిలబెట్టిన కరణ్ జోహార్ టీం ఇండియా యువ క్రికెటర్స్ పాండ్యా మరియు రాహుల్ లను జీరోలుగా మార్చేశాడు. చిన్న వయస్సులోనే వీరిద్దరు కూడా మంచి స్టార్ క్రికెటర్స్ గా పేరు తెచ్చుకున్నారు. కాని కరణ్ షో కు వెళ్లి చేసిన వ్యాఖ్యల వల్ల వారి కెరీర్ జీరో స్థాయికి పడిపోయింది. వారిద్దరు సరదాగా మాట్లాడిన మాటలు కెరీర్ ను నాశనం చేశాయి. అందుకు పరోక్షంగా పూర్తి కారణం కరణ్ జోహార్. వివాదం తారా స్థాయికి చేరిన నేపథ్యంలో కరణ్ ఎట్టకేలకు స్పందించి వారి భవిష్యత్తు నాశనం అవ్వడంకు నేను ఒక కారణం. ఆ విషయాన్ని తల్చుకుంటే చాలా బాధగా ఉంది. ఆ సంఘటన తర్వాత ఎన్నో నిద్రలేని రాత్రలు గడిపానంటూ చెప్పుకొచ్చాడు.
జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిన తర్వాత ఇప్పుడు కరణ్ జోహార్ అయ్యో అంటూ వారిపై సానుభూతి చూపడం విడ్డూరంగా ఉంది. ముందు నుండే కాఫీ విత్ కరణ్ షో పై విమర్శలు వస్తూ ఉన్నా కూడా, టీఆర్పీ రేటింగ్ బాగా వస్తుందనే ఉద్దేశ్యంతో బూతులు, వల్గర్ మాటలు మరీ పెంచాడు. అయితే సినిమా వారు అలా మాట్లాడితే ఏమో కాని, దేశానికి ప్రతినిథ్యం వహించే క్రికెటర్స్ ఆ వ్యాఖ్యలు చేయడంతో వివాదం చాలా పెద్దదయ్యింది. ఆ సమయంలో కరణ్ వారు అలా మాట్లాడేలా ప్రేరేపించాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
వారి కెరీర్ లు అర్థాంతరంగా ముగిసిపోనున్నాయంటే కారణం కరణ్ జోహార్ అంటూ క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాండ్యా మరియు రాహుల్ లపై నిషేదం కొనసాగుతుంది. మరో వైపు ఈ విషయమై విచారణ జరుగుతుంది. నిషేదం ఎత్తి వేయాలని కొందరు, పూర్తి బ్యాన్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే సీనియర్ క్రికెటర్స్ మాత్రం మొదటి తప్పుగా క్షమించి వదిలేయాలని కోరుతున్నారు. మరి ఈ విషయమై వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.