Begin typing your search above and press return to search.

క‌ర‌ణ్ సింగిల్ పేరెంట్ గా ఉండ‌టానికి కార‌ణం?

By:  Tupaki Desk   |   12 July 2022 2:30 AM GMT
క‌ర‌ణ్ సింగిల్ పేరెంట్ గా ఉండ‌టానికి కార‌ణం?
X
ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ పెళ్లెందుకు చేసుకోలేదు?  అత‌డు సింగిల్ పేరెంట్ గానే ఉండ‌టానికి కార‌ణ‌మేమిటీ?  పిల్ల‌ల‌ను స‌రోగ‌సీలో క‌నేందుకే అత‌డు ఎందుకు మొగ్గు చూపాడు? అత‌డి పై ర‌క‌ర‌కాల రూమ‌ర్ల‌కు కార‌ణ‌మేమిటీ? వీట‌న్నిటికీ అత‌డే స‌మాధానాలిచ్చాడు. కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7 హోస్ట్ ప్ర‌ముఖ వెబ్ తో మాట్లాడుతూ ప‌లు టాప్ సీక్రెట్స్ పై ఓపెన‌య్యాడు.

కరణ్ జోహార్ తన జీవితంలో భాగస్వామి లేకపోవడం వల్ల ఒంటరి పేరెంట్ గా మారినట్లు వెల్లడించాడు. మేరే జిందగీ మే ప్యార్ నహీ హై అని ఇటీవలి ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు. కవలలు యష్ - రూహికి సింగిల్ పేరెంట్ కావాలనే తన నిర్ణయం గురించి ఓపెన‌య్యారు.

క‌ర‌ణ్ త‌న గారాల‌ కవలలు యష్ - రూహికి అన్నీ తానే అయిన తండ్రి. 2017లో సరోగసీ ద్వారా తాను సింగిల్ పేరెంట్ గా మారానని వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వాస్తవానికి అతడు ఇరువురు వార‌సులను స్వాగతించిన తర్వాత తన ఇన్ స్టాగ్రామ్ బయోని ``ఒక తండ్రి.. ఒక‌ చిత్రనిర్మాత``గా మార్చాడు. ఇటీవలి ఇంటర్వ్యూలో కరణ్ సింగిల్ పేరెంట్ కావాలనే తన నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించాడు.

ఏస్ ఫిల్మ్ మేకర్ క‌ర‌ణ్‌ ను శృంగారం లేకపోవడం లేదా జీవితంలో భాగస్వామి లేకపోవడం వల్ల స‌రోగ‌సీలో కవలలు యష్ - రూహిలకు తండ్రి అయ్యారా? అని నేరుగా ప్ర‌శ్నించారు. దీనిపై కరణ్ స్పందిస్తూ .. నేను పేరెంట్ గా ఉండటానికి సిద్ధంగా ఉన్నానని నాకు తెలుసు. నా హృదయంలో కొంత భాగాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని నాకు తెలుసు. నేను నా ఇద్దరు పిల్లలతో క‌నెక్ట‌య్యాను.

నా హృదయంలో ఒక పెద్ద భాగం వారు అని.. నా హృదయంలోని ఒక పెద్ద భాగం నా తల్లి అని నేను అనుకుంటున్నాను. ఆ ప్రేమ భాగ్యంతోనే నేను సంతృప్తి చెందుతాన‌ని అన్నారు. ``క‌ర‌ణ్ మాట‌ల్లో అత‌డు త‌న త‌ల్లికి ఏ క‌ష్టం లేకుండా చూడాల‌నుకున్నాడ‌న్న హింట్ ఉంది. అలాగే పిల్ల‌లు కూడా త‌న‌కు కావాలి. కానీ భార్య కావాల‌నే ఆలోచ‌న లేదు!!`` అనేది అర్థ‌మవుతోంది.

చాలా మంది తన తీవ్రమైన పని షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకుని సింగిల్ పేరెంట్ గా మారవద్దని చెప్పారని.. అయితే తాను పేరెంట్ గా ఉండటానికి సిద్ధమ‌య్యాన‌ని తెలిపాడు. నా షెడ్యూల్ ను బట్టి నేను పిల్ల‌ల‌ను పెంచ‌డం చాలా క‌ష్టం అని వారంతా భావించారు. వారు సామాజిక కారణాల వల్ల అలా మాట్లాడుతున్నారని నేను అనుకోలేద‌ని అన్నారు.

``మీరు మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడు.. పేరెంట్ కావాలని మీకు తెలుస్తుంది. ఇద్దరితో(భార్య‌-భ‌ర్త‌)నే ఇది సంబంధీక‌మైన‌ది కాదు. ఇది కేవలం జిందగీ మే ప్యార్ నహీ హై తో మెయిన్ బచే లే ఆవుంగా కాదు.. నాకు ప్రేమ వైఫ్ లేనందున అది పాజిబుల్ కాదు.. నాకు పిల్లలు ఉండాలి అనుకున్నాను.. అని తెలిపారు.

ఈ సంవత్సరం కరణ్ జోహార్ కవలలు తమ ఐదవ పుట్టినరోజును జరుపుకున్నారు. ఇదిలా ఉండగా.. అత‌డు ప్రస్తుతం తన కొత్త చాట్ షో `కాఫీ విత్ కరణ్ సీజన్ 7` వ‌ల్ల నిరంత‌ర‌ వార్తల్లో ఉన్నారు. జూలై 7 నుంచి షో ర‌న్ అవుతోంది. మొదటి ఎపిసోడ్ లో రణవీర్ సింగ్ - ఆలియా భట్ క‌నిపించారు. మునుముందు ప్ర‌ముఖ తార‌లు ఈ వేదిక‌పై ర‌క‌ర‌కాల వ్య‌క్తిగ‌త‌ ర‌హ‌స్యాల‌ను లీక్ చేయిస్తున్నారు.