Begin typing your search above and press return to search.
సౌత్ సినిమాపై కరణ్ జోహార్ సెన్సేషనల్ కామెంట్స్
By: Tupaki Desk | 23 May 2022 1:30 PM GMTబాలీవుడ్ లో వరుసగా తెలుగుతో ఇతర దక్షిణాది చిత్రాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన పుష్ప, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 ఉత్తరాదిలో భారీ వసూళ్లని రాబట్టి రికార్డులు సృష్టించాయి. దీనిపై చాలా వరకు బాలీవుడ్ వర్గాల్లో అసంతృప్తి వున్నా పైకి మాత్రం ఎవరూ దాన్ని బయటపడనివ్వడం లేదు. ఇదిలా వుంటే ఆది నుంచి దక్షిణాది సినిమాకు అండగా వుంటూ వస్తున్న స్టార్ ప్రొడ్యూసర్, అండ్ డైరెక్టర్ కరణ్ జోహార్ తాజాగా పుష్ప, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2లపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం ఆయన నిర్మించిన `జుగ్ జుగ్ జీయో. వరుణ్ ధావన్, కియారా అద్వానీ, అనిల్ కపూర్, రణ్ బీర్ కపూర్ మదర్ నీతూ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్ మెహతా డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ సౌత్ సినిమాలపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆదివారం `జుగ్ జుగ్ జీయో. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని ముంబైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీమ్ తో కలిసి పాల్గొన్న కరణ్ జోహార్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఇటీవల దక్షిణాది చిత్రాల విజయాల తరువాత బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొందని మీరు భావిస్తున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు కరణ్ జోహార్ ఆసక్తికరంగా సమాధానం చెప్పారు. హిందీ సినిమాకు, దక్షిణాది సినిమాకు ఎక్కడా పోటీ లేదన్నారు. `బాహుబలి`కి సమర్పకుడిగా వ్యవహరించాను. ఎందుకంటే భాషతో సంబంధం లేకుండా సినిమా తన సత్తాని చాటుతుందని నమ్మాను. రెండు పరిశ్రమల మధ్య పోటీ ఎందుకు వుంటుంది. మనం కలిసికట్టుగా ఎదగాలన్నదే. ప్రధాన లక్ష్యం. ఓకే పరిశ్రమ అన్నప్పుడు పోటీ ఎందుకుంటుంది?. పైగా బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది` అని తెలిపారు.
అంటే కాకుండా `జుగ్ జుగ్ జీయో` ట్రైలర్ రిలీజ్ కు ముందు ఇది `హిందీ సినిమా ట్రైలర్` అనే పదాన్ని కరణ్ జోహార్ నొక్కి మరీ పలకడం విశేషం. ఇదే విషయాన్ని మీడియా అడిగితే ` `ట్రిపుల్ ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు మంచి బిజినెస్ చేయడమే కాకుండా ఈ సినిమాలు ప్రేక్షకుల ఆదరణ కూడా పొందాయి. ఇది భారతీయ సినిమా సాధించిన ఘనత అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం` అన్నారు. ఈ సినిమాలు సాధించిన విజయం భారతీయ సినిమాని ఉన్నత స్థాయికి చేర్చింది. ప్రశాంత్ నీల్ అయినా, రాజమౌళి అయినా మన సినిమా స్థాయి గొప్పదనే విషయాన్ని నిరూపించయడానికి ప్రయత్నించారు` అని తెలిపారు.
అంతే కాకుండా మరిన్ని విశేషాలు తెలియజేస్తూ 1 ట్రైలర్ రిలీజ్ లో హిందీ సినిమా ట్రైలర్ అనడానికి టెక్నికల్ కారణాలున్నాయి. ఇటీవల విడుదలైన `హిందీ మూవీ `గంటూ బాయి`మంచి వసూళ్లని రాబట్టింది. ఇటీ రీసెంట్ గా విడుదలైన `భూల్ భూలయ్యా 2` అద్భుతమైన విజయాన్ని సాధించింది.
మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. సినిమా నిర్మాతగా నా సినిమా కూడా ఆజాబితాలో చేరాలని కోరుకుంటున్నాను` అన్నారు. ఇక సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రికార్డు స్థాయి వసూళ్లని కరాబట్టడంపై అది బెస్ట్ క్రాస్ ఓవర్ బిజినెస్ అన్నారు. ఫిల్మ్ ఫెస్టివెల్స్ కి వెళ్లడం ఆస్కార్ గెలవడం అన్నది మాకు ముఖ్యం కాదు. కలిసి కట్టుగా భారతీయ సినిమాగా ఎదగాలన్నదే మాకు ముఖ్యం అని పేర్కొన్నారు కరణ్ జోహార్.