Begin typing your search above and press return to search.

ట్రాలింగ్ కు కరణ్ మార్క్ పంచ్

By:  Tupaki Desk   |   18 Jun 2017 9:21 AM GMT
ట్రాలింగ్ కు కరణ్ మార్క్ పంచ్
X
సోషల్ మీడియా విస్తృతం అయిపోయాక.. ట్రాలింగ్ బాగా పెరిగిపోయింది. ఏదైనా పాయింట్ దొరికితే తెగ ఏకేస్తున్నారు నెటిజన్లు. యాంటీ ఫ్యాన్స్ కు అయితే ఇదో ఆయుధం అయిపోయింది. వీటికి తోడు సెలబ్రిటీలను ఆడేసుకోవడం తెగ ఫ్యాషన్ అయిపోయింది కూడా.

బాలీవుడ్ లో ట్రాలింగ్ బాగా ఎక్కువగా కనిపిస్తుంటుంది. దర్శకుడు కరణ్ జోహార్ ఓపెన్ గా చెప్పిన మాటలు.. తన పుస్తకంలో రాసిన కొన్ని పేరాల కారణంగా.. జనాల్లో హాట్ టాపిక్ అయిపోయాడు. ఆయన సెక్సువాలిటీపై తెగ ట్రాలింగ్ జరిగింది. చాలాకాలం పాటు ఊరకుండిపోయిన కరణ్ జోహార్.. ఇప్పుడు 'నా ప్రియమైన ట్విట్టర్ ట్రాలింగ్.. మార్కెట్ లో ఇప్పుడో కొత్త ప్రొడక్ట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు జీవితం. దయచేసి దాన్ని తెచ్చుకోండి. ప్రస్తుతం ఆఫర్ ఓపెన్ గా ఉంది. స్టాక్ ఉన్నంతవరకు.' అంటూ ట్రాలింగ్ చేసేవారికి కౌంటర్ వేసిన కరణ్ జోహార్.. మీ సొంత జీవితాల గురించి చూసుకోండి అంటూ ఇన్ డైరెక్టుగా పంచ్ వేశాడు.

ప్రధాని నరేంద్ర మోడీని కలిసినపుడు.. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పొట్టి బట్టలు వేసుకుందని జనాలు ట్రాలింగ్ చేశారు. రంజాన్ మాసంలో అసభ్యమైన దుస్తులు వేసుకుందంటూ దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. వీటిన్నిటికీ సింగిల్ పంచ్ తో సమాధానం ఇచ్చాడు కరణ్ జోహార్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/