Begin typing your search above and press return to search.
కరోనా కల్లోలం: భారీ సినిమాలు మిడిల్ డ్రాప్!
By: Tupaki Desk | 19 March 2020 11:10 AM GMTకరోనా కల్లోలం సినీపరిశ్రమల్ని సర్వనాశనం చేస్తోందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ టాలీవుడ్ అన్నిచోట్లా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చాలా మంది ఆఫీసులకు తాళాలు వేసుకుని ఇళ్లకు స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో నగరాలు బోసిపోయి కనిపిస్తున్నాయి.
ఇదంతా ఒకెత్తు అనుకుంటే బాలీవుడ్ లో సన్నివేశం మరీ దారుణంగా ఉందని అర్థమవుతోంది. అక్కడ కరణ్ జోహార్ లాంటి ఖరీదైన దర్శకనిర్మాత సైతం ఇప్పుడు మరీ అంతగా సోకులకు పోవడం లేదు. నష్టం వచ్చే ప్రాజెక్టుల్ని నిరభ్యంతరంగా డ్రాప్ చేస్తున్నారుట. అతడు ఇప్పటికే తక్త్ .. దోస్తానా 2 లాంటి చిత్రాల్ని పట్టాలెక్కించేందుకు ఆఫీస్ తెరిచి వర్క్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం సీన్ మారిపోయింది. కరోనా దెబ్బకు కరణ్ సైతం గంగవెర్రులెత్తిపోతున్నాడట. అసలే భారీ కాన్వాసుపై భారీ బడ్జెట్లతో వీటిని తెరకెక్కించాల్సి ఉండగా.. కరోనా కల్లోలం చూస్తుంటే ఇది సాధ్యపడదని భయపడ్డాడట. దీంతో ప్రస్తుతం తన ఆఫీస్ ని క్లోజ్ చేసేశాడట. ఇప్పటికి తఖ్త్ విషయంలో మిడిల్ డ్రాప్ అయినట్టేనని చెబుతున్నారు. దోస్తానా 2పైనా ఈ ప్రభావం ఉంటుందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయట.
కరణ్ జోహార్ దర్శకత్వం వహించనున్న చారిత్రక మొఘల్ కాస్ట్యూమ్ డ్రామా తఖ్త్ భారీ తారాగణంతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. రణవీర్ సింగ్- కరీనా కపూర్ ఖాన్ - అలియా భట్ - జాన్వీకపూర్ లాంటి టాప్ స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడు ఇది ‘రెడ్’ జోన్ లోకి వెళ్లిపోయింది. ఓ క్లోజ్ సోర్స్ ప్రకారం... ``తఖ్త్ అప్పటికే వదిలేయాలనుకున్న ప్రాజెక్ట్. ఈ సినిమా కథాంశం విషయమై ఆరంభమే వివాదాలు ముసురుకున్నాయి. పైగా స్క్రిప్ట్ రైటర్ మతపరమైన ట్వీట్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయినా.. కరణ్ ఇంతటితో ముగించి ఇకపై అయినా ముందుకు వెళ్లి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కరోనా కల్లోలం పరిస్థితులతో.. తఖ్త్ లాంటి భారీ చిత్రం సేఫ్ కాదు`` అని భావిస్తున్నాడట
ఈ వారంలో తాత్కాలికంగా తన కార్యాలయాన్ని మూసివేసిన ధర్మ ప్రొడక్షన్స్ దోస్తానా 2 ని అయినా సెట్స్ పైకి తీసుకెళుతుందా? అంటే చెప్పలేని పరిస్థితి. ఇటీవల ప్రకటించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే-సిధాంత్ చతుర్వేది తదితరులు నటించనున్నారు. ఇక దీంతో పాటు ఇతర ప్రాజెక్టులను తిరిగి ఆలోచించడం.. పునర్నిర్మించడం లేదా వదిలివేయడం ఏదో ఒకటి చేయాల్సిందేనని చెబుతున్నారు. ఒకేళ తిరిగి మొదలు పెట్టాలి అంటే ఇప్పటికే రాసుకున్న గే కాన్సెప్టును మార్చాల్సి ఉంటుంది. అంటే కరణ్ నేరుగా బరిలో దిగాల్సి ఉంటుందన్నమాట. మరోవైపు నిర్మాత సాజిద్ నాడియాద్వాలా షెడ్యూల్ ప్రకారం తన ప్రణాళికలను కొనసాగిస్తారు. నాడియాద్ వాలా `హీరో పంతి 2` షూటింగ్ జూలైలో ప్రారంభం కానుంది.