Begin typing your search above and press return to search.

ఫేస్ మార్ఫింగ్‌?? కొత్త హీరోయిన్??

By:  Tupaki Desk   |   10 Oct 2016 6:01 AM GMT
ఫేస్ మార్ఫింగ్‌?? కొత్త హీరోయిన్??
X
యురి టెర్రరిస్టు ఎటాక్ తరువాత.. ఖచ్చితంగా పాకిస్తాన్ నటులు కనుక ముంబయ్ లో పనిచేస్తే వారిని అడ్డుకుంటామాని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన వంటి సంస్థలు ప్రకటించాయి. ఆ దెబ్బతో ప్రొడ్యూసర్ల కౌన్సిల్ సైతం పాక్ నటులపై దేశంలో బ్యాన్ విధించింది. ఆ దెబ్బతో రెండు సినిమాలకు కాస్త గాట్టిగా దెబ్బపడేలా ఉంది. ఒకటి కరణ్‌ జోహార్ తీసిన ''ఏ దిల్ హై ముష్కిల్‌''.. ఇంకొకటి షారూఖ్‌ ఖాన్ సినిమా ''రయీస్‌''.

కరణ్‌ సినిమాలో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. రణబీర్ తరువాత అతనే సెకండ్ హీరో. అయితే పాక్ నటుడు ఉంటే రిలీజ్ కు ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని కరణ్‌ భయం. అందుకే ఫవాద్ ఖాన్ ఫేస్ ను మార్ఫింగ్ టెక్నాలజీతో ద్వారా సైఫ్‌ ఆలీ ఖాన్ ఫేస్ తో రీప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది అని యోచిస్తున్నాడట. ఇప్పటికే ''ఎం.ఎస్.ధోని'' బయోజిక్ సినిమాలో చాలా సీన్లలో క్రికెట్ షాట్లు ఆడుతున్నప్పుడు.. ఒరిజినల్ ఫుటేజ్ లో ధోని ఫేస్ తీసేసి అక్కడ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫేసును పెట్టేశారు. అదే టెక్నాలజీ వాడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడట కరణ్‌. కాని దాని వలన సినిమా రిలీజ్ అక్టోబర్ 28న కాకపోవచ్చు. అందుకే ఆ టెక్నాలజీ ఐడియాను ఉపసంహరించుకుని.. ఎం.ఎన్.ఎస్ వారితో ఏదైనా రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడట.

ఇకపోతే షారూఖ్‌ తన ''రయీస్‌'' సినిమాలో మహీరా ఖాన్ అనే పాక్ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నాడు. అయితే ఆమెతో తక్కువ రోజులే షూట్ చేశారట. అందుకే ఇప్పుడు మరో హీరోయిన్ ను తీసుకుని.. కొత్త షెడ్యూల్ లో ఈ కొత్త హీరోయిన్ తో షూట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. కరణ్‌ జోహార్ సినిమాకే పాక్ నటుల కారణంగా వార్నింగులు ఇస్తే.. షారూఖ్‌ ఖాన్ సినిమాను అంటే యాంటి-పాక్ సెంటిమెంట్ పూర్తిగా కబళించేసే సీనుంది. అందుకే కింగ్ ఖాన్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/