Begin typing your search above and press return to search.

ఆ న‌లుగురు 15 కోట్లు పై మాటే

By:  Tupaki Desk   |   4 Nov 2015 11:30 AM GMT
ఆ న‌లుగురు 15 కోట్లు పై మాటే
X
ఈరోజుల్లో సినిమా తీయాలంటే 50 కోట్ల నుంచి 60 కోట్లు పెట్టుబ‌డులు పెట్టాల్సిన ప‌రిస్థితి. అందులో హీరో - డైరెక్ట‌ర్ రెమ్యున‌రేష‌న్లే 30 కోట్లు పైగా ఉంటున్నాయి. కాస్ట్ ఫెయిల్యూర్‌ కి ఈ ఇద్ద‌రే కార‌ణం అని వేలెత్తి చూపేవాళ్లున్నారు. అయితే డిమాండ్‌ ని బ‌ట్టే పారితోషికం.. స‌క్సెస్‌ ని బ‌ట్టే డ‌బ్బు అన్న ప్రాతిప‌దిక‌గా చూస్తే ద‌ర్శ‌క హీరోల‌కు ఈ రేంజులో పారితోషికాలు ఇవ్వ‌డం స‌మంజ‌స‌మే అనే వాద‌న కూడా ఉంది.

ఇప్పుడు టాలీవుడ్‌ లో న‌లుగురు టాప్ డైరెక్ట‌ర్స్ రూ.15 కోట్లు పైగా పారితోషికం అందుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. రాజమౌళి తరువాత వి.వి.వినాయ‌క్‌ - త్రివిక్ర‌మ్‌ - కొర‌టాల శివ.. ఈ ముగ్గురి గురించి ఇంట్రెస్టింగ్ డిబేట్ న‌డుస్తోంది. అస‌లు వీళ్ల‌కు ఆ రేంజులో పారితోషికం ఇచ్చుకోవ‌డానికి కార‌ణ‌మేంటి? అని అరాతీస్తే.. చాలా మ్యాట‌ర్స్ అర్థ‌మ‌వుతాయి. వినాయ‌క్ అంటే మినిమం గ్యారెంటీ. అత‌డి శైలిలో మాస్ మ‌సాలా ఎంట‌ర్‌ టైన్‌ మెంట్‌ ల‌కు ఎల్ల‌పుడూ ఆద‌ర‌ణ ఉంటుంద‌న్న‌ది ఇప్ప‌టికే ప్రూవ్డ్‌. అత‌డు అల్లుడు శీను కోసం 15 కోట్లు అందుకున్నాడు. అదే మొత్తాన్ని ఇప్పుడు అఖిల్ చిత్రం కోసం అందుకున్నాడ‌ని చెబుతున్నారు. అలాగే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఆల్వేస్ స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తుంటాడు. 50 ప్ల‌స్ కోట్ల బిజినెస్ అత‌డి సినిమాకి ఉంటుంది.. కాబ‌ట్టి అత‌డికి 15 కోట్లు పారితోషికం ముట్ట‌జెబితే త‌ప్పేం లేద‌న్న వాద‌న ఉంది.

ఇటీవ‌లి కాలంలో రెయిజింగ్ డైరెక్ట‌ర్‌ గా తెర‌పైకి దూసుకొచ్చిన కొర‌టాల వ‌రుస‌గా మిర్చి - శ్రీ‌మంతుడు చిత్రాల‌తో రికార్డ్ విజ‌యాలు అందుకుని పారితోషికంలో కొండెక్కి కూచున్నాడు. ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీస్ తెర‌కెక్కించే సినిమాకి అత‌డు ఏకంగా 15కోట్లు పారితోషికం అందుకుంటున్నాడ‌ని చెబుతున్నారు. ఇక పోతే జ‌క్క‌న్న రాజ‌మౌళి స్ర్టాట‌జీనే వేరు. అత‌డు బాహుబ‌లి కంటే ముందే 15 కోట్లు పైగా పారితోషికం అందుకున్నాడు. ఇప్పుడు అంత‌కు రెట్టింపు అందుకుంటున్నాడ‌ని, కొన్ని ఏరియాల హ‌క్కులు తీసుకుంటున్నాడ‌ని చెప్పుకుంటున్నారు. అదీ మ్యాట‌రు.