Begin typing your search above and press return to search.

దేవీశ్రీప్రసాద్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు.. అసలు ఈ కేసు ఏంటి? వివాదామేంటి?

By:  Tupaki Desk   |   3 Nov 2022 5:11 AM GMT
దేవీశ్రీప్రసాద్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు.. అసలు ఈ కేసు ఏంటి? వివాదామేంటి?
X
తాజాగా టాలీవుడ్ ఫేమస్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. దేవీ శ్రీప్రసాద్ పై ప్రముఖ వివాదాస్పద సినీ నటి కరాటే కళ్యాణి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ ఐటెం సాంగ్ విషయమై ఆమె మండిపడుతూ పోలీసులకు కంప్లైంట్ చేసింది.

సినిమాలన్నాక పలు సన్నివేశాలు, పాటలు వివాదాస్పద కావడం.. అభ్యంతరాలతో తొలగించడం ఇటీవల కామన్ గా జరుగుతోంది. ఈ మధ్య ఇలాంటి వివాదాలు ముసురుకుంటున్నాయి. చిన్న చిన్న ప్రైవేట్ సాంగ్స్ నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకూ ఇలాంటి వివాదాలు తప్పవు. తాజాగా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తన మొట్టమొదటి ఆల్బమ్ సాంగ్ "ఓ పరి"తో వచ్చారు. ఈ పాటకు మిశ్రమ స్పందన లభించింది. టి-సిరీస్ ఛానెల్‌లో విడుదలైన హిందీ వెర్షన్ కోసం పాడిన పాట 20+ మిలియన్ల వ్యూస్ సంపాదించింది.

నటి కరాటే కళ్యాణి ఇప్పుడు ఈ పాటలోని సాహిత్యం హిందూ మతాన్ని , హిందువులను అవమానించేలా ఉందని విమర్శిస్తూ హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కరాటే కళ్యాణ్ ఇటీవల విడుదల చేసిన 'ఓ పారీ' సాంగ్‌లో పవిత్ర హిందూ శ్లోకం 'హరే రామ హరే కృష్ణ'ని ఉపయోగించడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని.. తోటి హిందూ సంస్థలను కించపరిచేలా ఇది ఉందని పేర్కొంది.

కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజుల్లో హిందువులు అవమానాలకు గురవుతున్నారు. చాలా విలువలతో కూడిన దిగ్గజ వ్యక్తి శ్రీరాముడి గొప్పతనం గురించి మాట్లాడేందుకు మేము హరే రామ హరే కృష్ణ అని జపిస్తాము. ఈ పాటను కంపోజ్ చేసిన దేవీశ్రీప్రసాద్ 'హరే రామ హరే కృష్ణ' పదాలను పాటలో వాడినందుకు నేను షాక్ అయ్యానని ఆమె ఆరోపించింది.

దేవీశ్రీ హిందువు అయినప్పటికీ హిందూ మతాన్ని గౌరవించలేదు. శ్లోకం కోసం బికినీలలో అమ్మాయిలను డ్యాన్స్ చేశాడు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు హిందువులను ఈ విధంగా అవమానిస్తే ఊరుకోము. హిందువుల పవిత్ర మంత్రాలను అవమానించినందుకు దేవిశ్రీ ప్రసాద్ హిందువులందరికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కళ్యాణి డిమాండ్ చేసింది.

హిందువుల విశ్వాసాలను, వ్యవస్థలను గౌరవించని సినిమాలు తాను చేయలేదని.. కొన్ని పాత్రలను వదులుకున్నానని ఈ సందర్భంగా కరాటే కళ్యాణ్ స్పష్టం చేశారు.

-వివాదం ఇదీ

హిందీలో దేవీశ్రీ ప్రసాద్ తాజాగా 'ఓ పోరి' అనే పాప్ ఆల్బమ్ ను పాడి విడుదల చేశారు. విదేశీ మోడల్స్ తో కలిసి దేవీ శ్రీ ఈ పాటలో తెగ హంగామా చేస్తూ ఆల్బమ్ రూపొందించారు. అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్ లాంటి దేశాల్లో చిత్రీకరించిన ఈ పాటను భారీ బడ్జెట్ తో తీశారు. అయితే ఈ పాటను విడుదల చేశాక అందులో వాడిన 'హరే రామ హరే కృష్ణ' మంత్రం వివాదాస్పదమైంది. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కరాటే కళ్యాణి సహా పలువురు ఫిర్యాదు చేశారు. అశ్లీల దుస్తులు, నృత్యాలు చేస్తూ ఈ పాటను తీశారని వారు ఆరోపిస్తున్నారు. నిలిపివేయాలని కోరుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.