Begin typing your search above and press return to search.
నెటిజన్‌లకు అడ్డంగా బుక్కైన కరీనా
By: Tupaki Desk | 11 Dec 2021 2:30 AM GMTబాలీవుడ్ క్రేజీ జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ గురువారం బర్వారా రాజస్థాన్‌లోని సిక్స్ సెస్సెస్ ఫోర్ట్‌లో అట్టహాసంగా జరిగిన వివాహ వేడుకలో భార్య భర్తలు అయిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు ఉత్తరాదికి చెందిన ప్రముఖులతో పాటు దక్షిణాదికి చెందిన సెలబ్రిటీలు కూడా భారీ స్థాయిలో హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు అందజేశారు. అంతే కాకుండా ఫస్ట్ వెడ్డింగ్ పిక్ కి సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ భారీ స్థాయిలో స్పందించి కొత్త జంటపై శుభాకాంక్షల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కూడా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జంటకు శుభాకాంక్షలు అందజేసింది. `మీరు సాధించారు. ఆ దేవుడి ఆశీస్సులు మీకు` అని పోస్ట్ పెట్టింది. అయితే ఈ విషయాన్ని గమనించిన ఓ నెటిజన్ స్క్రీన్ షాట్ ని షేర్‌చేస్తూ మొత్తానికి కరీనా.. పెళ్లి తరువాత కత్రినని ఫాలో అవుతోందని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది.
రన్ బీర్ కపూర్ - కత్రినా కైఫ్ ఓ దశలో ప్రేమాయణాన్ని సాగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కత్రినాని ఫాలో అయిన కరీనా ఆ తరువాత వీరిద్దరూ విడిపోవడంతో కరీనా కూడా కత్రినని ఫాలో కావడం మానేసింది. ఒక విధంగా చెప్పాలంటే తనని దూరం పెట్టేసింది. తాజాగా మళ్లీ కత్రినని కరీనా ఫాలో అవుతుండటంతో నెటిజన్స్ ఆమెపై కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.