Begin typing your search above and press return to search.
డెలవరీ అయిన నెల రోజుల్లోనే కెమెరా ముందుకు వచ్చేసింది
By: Tupaki Desk | 25 March 2021 9:30 AM GMTహీరోయిన్స్ పెళ్లి అయితే సినిమాల్లోకి పనికి రారు అనే భావన గతంలో ఉండేది. పిల్లలు అయిన హీరోయిన్స్ ను జనాలు పట్టించుకోరు అంటూ ఇంతకు ముందు ఇండస్ట్రీలో అభిప్రాయం ఉండేది. కాని పెళ్లి అయినా పిల్లలు ఉన్నా కూడా హీరోయిన్స్ కు అందం మరియు ప్రతిభ ఉంటే నెత్తిన పెట్టుకుంటారు అంటూ నిరూపితం అవుతుంది. పిల్లల వయసు పదుల సంఖ్యకు చేరుకున్నా కూడా హీరోయిన్స్ గా అందాల ఆరబోతకు సిద్దం అవుతున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అందులో కరీనా కపూర్ ఖాన్ ఒకరు అనడంలో సందేహం లేదు. 2016లో తైమూర్ కు జన్మనిచ్చిన ఈమె నెల రోజుల క్రితం రెండవ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే.
కరీనా సెకండ్ డెలవరీ అయ్యి నెల రోజులు అయ్యిందో కాలేదో అప్పుడే షూటింగ్ లో జాయిన్ అయ్యింది. అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో ఈమె నటిస్తుంది. అలాగే విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న 'సీత' అనే భారీ పాన్ ఇండియ మూవీలో కూడా ఈమె నటించబోతుంది. ఇదే సమయంలో వరుసగా కమర్షియల్స్ ను కూడా ఈమె చేస్తుంది. అందుకే డెలవరీ అయిన నెల రోజులకే కెమెరా ముందుకు వచ్చింది. మొదటి బిడ్డ కు జన్మనిచ్చిన సమయంలో కాస్త సమయం తీసుకున్న కరీనా ఈసారి మాత్రం అస్సలు బ్రేక్ తీసుకున్నట్లుగా అనిపించలేదని బాలీవుడ్ మీడియా వర్గాల వారు అంటున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శరీరంలో మార్పులు వస్తాయి. కాని కరీనాకు అలాంటిది ఏమీ కనిపించడం లేదంటున్నారు.