Begin typing your search above and press return to search.

బోబో వ‌ర్సెస్ జాను..కాపీ సింగారం?

By:  Tupaki Desk   |   10 Feb 2020 4:30 PM GMT
బోబో వ‌ర్సెస్ జాను..కాపీ సింగారం?
X
ఒక‌రిని అనుస‌రిస్తే స్ఫూర్తి అంటాం. సేమ్ టు సేమ్ దించేస్తే కాపీ అని కూడా విమ‌ర్శిస్తుంటారు. క‌థ‌లు కాపీ.. ట్రైల‌ర్ కాపీ.. పోస్ట‌ర్ కాపీ.. మేక‌ప్ కాపీ.. దుస్తులు కాపీ .. ఇలా కాపీలెన్నో ఉన్నాయి. అయితే దీనిని కాపీ అనే అనాలా లేక కేవ‌లం స్ఫూర్తి పొందార‌ని అనాలా? ఏమో! అది స‌మంత అభిమానులే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే ఈ ఫోటో అక్కినేని అభిమానుల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది.

చీర‌లో బెబో సింగారాన్ని డామినేట్ చేసేంత అందంగా క‌నిపిస్తోంది సామ్. అప్ప‌ట్లో క‌రీనా క‌పూర్ తాను ధ‌రించిన చీర‌పై బెబో అంటూ ప్రింట్ చేయించుకుంటే.. ఇప్పుడు సామ్ `జాను` అని ప్రింట్ చేయించుకుంది. జాను ప్ర‌మోష‌న్స్ కి ఇదే చీర‌తో సామ్ ఎంట్రీ ఇవ్వగానే చుట్టూ జ‌నం అస్స‌లు క‌ళ్లు తిప్పుకోలేక‌పోయారంటే న‌మ్మండి. నెవ్వ‌ర్ బిఫోర్ లుక్ తో సామ్ చంపేసింది. ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ ఊర్వ‌శి సేథ్ రూపొందించిన పిచిక బ్రాండ్ డిజైన్ ఇది. అప్పుడు క‌రీనా ధ‌రించ‌గా.. ఇప్పుడు సామ్ ఆ డిజైన్ కి ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చింది.

అల్ట్రా మోడ్ర‌న్ స్టైలింగ్ విష‌యంలో సామ్ కి ఇద్ద‌రు బాలీవుడ్ స్టార్లు స్ఫూర్తి అని అర్థ‌మ‌వుతోంది. రెగ్యుల‌ర్ గా లైఫ్ మోడ‌ల్ విష‌యంలో అనుష్క శ‌ర్మ‌ను అనుస‌రిస్తుంటే.. అప్పుడ‌ప్పుడు స్టైలింగ్ ప‌రంగా బోబోని ఫాలో అయిపోతున్న‌ట్టే క‌నిపిస్తోంది. అనుష్క శ‌ర్మ‌లానే నిర్మాత‌గా మారి స‌మంత స‌త్తా చాటాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉందిట‌. అలాగే వెబ్ సిరీస్ లు .. టీవీ షోలు అంటూ ప‌లువురు తార‌ల్ని ఫాలో చేయనుంది. అయితే మునుముందు అయినా ఒక‌రిని అనుస‌రించకుండా.. త‌న‌దైన స్టైల్ ని సామ్ ప్రెజెంట్ చేస్తుందా లేదా? అన్న‌ది చూడాలి.