Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: హ్యాపీ మూమెంట్

By:  Tupaki Desk   |   23 Feb 2018 5:33 PM GMT
ఫోటో స్టోరి: హ్యాపీ మూమెంట్
X
బాలీవుడ్ లో సినీ తారల కుటుంబాల గురించి వివరించడం కొంచెం కష్టమే. అన్ని ఇండస్ట్రీలో కంటే అక్కడే ఎక్కువగా వారసులు పుట్టుకొస్తుంటారు. సినీ వరల్డ్ ఫ్యామిలీ లో ఉన్న వారు ఒక్క సినిమా అయినా చేయకుండా ఉండడం లేరు. ఒక వేళ చేయకపోయినా వారి గురించి నార్త్ ప్రేక్షకులకు బాగా తెలుస్తోంది. వారి ప్రవర్తనతో ఇండస్ట్రీలో వివిధ బినేనెస్ లలో కొనసాగుతూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

ఇక అసలు విషయం లోకి వెళితే.. బాలీవుడ్ పటౌడి ఫ్యామిలీ గురించి అందరికి తెలిసిందే. నటులు నిర్మాతలు ఆ ఫ్యామిలీ లో చాలా మందే ఉన్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్ కరీనా కపూర్ ని పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీ గా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కరీనా ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం చాలా కామన్.

రీసెంట్ గా అలాంటి మూమెంట్ ని మరోసారి అభిమానులతో షేర్ చేసుకుంది. తన ఫ్యామిలీలోని కునల్ కీము ఫ్యామిలీ తో కరీనా ఫొటోకి స్టిల్ ఇచ్చింది. కీము సతీమణి సోహా అలీ ఖాన్ తన డాటర్ ని ఎత్తుకొని ఉండగా.. కరీనా తన కుమారుడితో నవ్వుతూ కనిపించింది. ఈ ఫ్యామిలీలు వీకెండ్స్ లో ఎక్కువగా కలుసుకుంటారట. ఏ మాత్రం చిన్న వేడుకలు జరిగినా అందరు ఒక చోట చేరి చాలా సరదాగా జరుపుకుంటారని తెలుస్తోంది. అలాగే రీసెంట్ గా చిన్న పార్టీ మూమెంట్ లో ఇలా ఇద్దరు కలిసి సంతోషంగా గడిపారు. అది సంగతి.